
Director Siva Nageswara Rao: టాలెంట్ అండ్ లక్ రేర్ కాంబినేషన్. అలాంటి హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈ స్టార్ లేడీ పరిశ్రమకు వచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల కెరీర్లో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. సమంత పట్టిందల్లా బంగారం అయ్యింది. ఏమాయ చేసావె మూవీతో సమంత పరిశ్రమలో అడుగుపెట్టారు. 2010లో విడుదలైన ఆ మూవీ సూపర్ హిట్. వెంటనే స్టార్ హీరో ఎన్టీఆర్ తో ఛాన్స్. బృందావనం సూపర్ హిట్. ఆ నెక్స్ట్ మహేష్ పక్కన ఛాన్స్. దూకుడు ఇండస్ట్రీ హిట్. తెలుగులో నాలుగో సినిమాకే రాజమౌళి మూవీలో ఛాన్స్… ఇలా అన్నీ సమంతకు కలిసొచ్చాయి.
అయితే ఏమాయ చేసావే కంటే ముందు ఆమె ఓ తెలుగు సినిమాలో నటించాల్సిందట. ఈ విషయాన్ని దర్శకుడు శివ నాగేశ్వరరావు వెల్లడించారు. చదువుకునే రోజుల్లోనే సమంత మోడలింగ్ చేసేవారు. అలాగే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. శివ నాగేశ్వరరావు ‘నిన్ను కలిసాక’ చిత్రం కోసం సమంతను ఆడిషన్ కి పిలిచారట. చెన్నై నుండి సమంత హైదరాబాద్ వచ్చారట. ఆడిషన్ లో సమంత పెర్ఫార్మన్స్ నచ్చి హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారట.

దాంతో రెమ్యూనరేషన్ ఎంత కావాలని అడిగారట. సమంత చెప్పిన అమౌంట్ శివ నాగేశ్వరరావు ఇవ్వలేనని చెప్పారట. దాంతో మూవీ చేయనని సమంత అన్నారు. అయితే ఆ నెక్స్ట్ డే చెన్నై వెళ్లొచ్చు, ఈ రోజు ఇక్కడే ఉండండి. ఇవాళ ఫ్లైట్ టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే సమంత ససేమిరా అందట. దాంతో చేసేది లేక ఖర్చు ఎక్కువ అయినా టికెట్స్ బుక్ చేసి ఆమె చెన్నై వెళ్లే ఏర్పాట్లు చేశారట.
ఈ విషయాలు తాజా ఇంటర్వ్యూలో శివ నాగేశ్వరరావు వెల్లడించారు. సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్. అందుకే ఈ స్థాయికి ఎదిగారు. అప్పుడు ఆమె అడిగిన రెమ్యూనరేషన్ మా బడ్జెట్ పరిధిలో లేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ లో సమంత చేయలేదని చెప్పుకొచ్చారు. అసలు ఒక్క సినిమాలో కూడా నటించడం కూడా సమంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, ఒక రోజు కూడా ఉండటం కుదరదు వెంటనే ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మొదటి నుండి సమంత గడుసుదని అర్థం అవుతుంది.