
Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియా సంచలనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. విచ్చలవిడిగా చూపించేస్తుంది, ఎవరైనా కామెంట్ చేస్తే కామామ్ తురాణం అంటూ తిరిగి కౌంటర్లు ఇస్తుంది. బూతు నా బట్టల్లో లేదు. చూసే మీ చూపులో ఉందని సమర్ధించుకుంటుంది. తాజాగా అషురెడ్డి స్విమ్మింగ్ పూల్ లో అగుపించారు. సెమీ బికినీ ధరించి టెంపరేచర్ పెంచేశారు. అషురెడ్డి హాట్ ఫోటోలకు తోడు క్రేజీ కామెంట్ మరింత రెచ్చగొట్టింది.
తడిసిన అందాలను పరిచయం చేసిన అషురెడ్డి… ఇప్పుడు మీ దృష్టి నాపై పడిందా?… కానీ కామెంట్ మాత్రం చేయకండి. దాని అవసరం లేదని, కామెంట్ పెట్టింది. అయితే ఆమె ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు. పచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. అషురెడ్డి స్విమ్మింగ్ పూల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బోల్డ్నెస్ లో నిన్ను బీట్ చేసేవారు లేరంటూ ఆమెను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.
బోల్డ్ ఇమేజ్ కలిగిన అషురెడ్డి మనసు మాత్రం వెన్న అట. ఆమె కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందట. తన సంపాదనలో కొంత అందాలకు ఖర్చు చేస్తుందట. అషురెడ్డి కొందరు అనాధ ఆడపిల్లలను చదివిస్తున్నారు. వారు డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత కోర్సులు అభ్యసిస్తున్నారట. వాలెంటైన్స్ రోజు వినూత్నంగా అనాధ శరణాలయంలో కనిపించారు. కమెడియన్ హరితో పాటు ఆర్ఫాన్ హోమ్లో పిల్లలతో గడిపారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.
ఇక అషురెడ్డి కెరీర్ పరిశీలిస్తే… ఆమె సోషల్ మీడియా వీడియోలతో ఫేమస్ అయ్యారు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. హౌస్లో కూడా అందాల ప్రదర్శనకు తెరలేపారు. అయితే ఆమె టెక్నిక్స్ వర్క్ అవుట్ కాలేదు. అషురెడ్డిని ఆడియన్స్ త్వరగానే బయటకు పంపేశారు.

బిగ్ బాస్ హౌస్లో ఉంది తక్కువ వారాలే అయినా పాపులారిటీ రాబట్టింది. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ వార్తలను బలపరిచే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. వాస్తవంగా అషురెడ్డి-రాహుల్ మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి. బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. ఆమె సిల్వర్ స్క్రీన్ మీద బిజీ కావాలని చూస్తున్నారు. అషురెడ్డి ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. గతంలో ఆమె అడపాదడపా చిత్రాల్లో అషురెడ్డి నటించడం విశేషం.