Norway Princess Martha Louise: రాజభోగాలు అనుభవించే అవకాశం వస్తే ఈ రోజుల్లో ఎవరూ వదులుకోరు. ఎందుకంటే అలాంటి అవకాశం కోసం కొందరు జీవితాలనే త్యాగం చేస్తున్నారు. కానీ నార్వే యువరాణి మాత్రం తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదని తెగేసి చెప్పింది. సాదా సీదా జీవితాన్ని అనుభవించేందుకు మొగ్గు చూపింది.. ఈ నేపథ్యంలో తనకు రాజ్యానికి సంబంధించి ఏ అధికారం వద్దని ప్రకటించింది. అంతేకాకుండా తనకు ప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ‘రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దైవ దూతగా చెప్పుకుంటున్న 51 ఏళ్ల నార్వే యువరాణి మార్థా లూయిస్.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరేట్ తో ప్రేమలో పడ్డారు. అయితే లూయిస్ కు అంతకుముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే భర్తతో విడిపోయారు. ఆ తరువాత డ్యూరెక్ వేరేట్ ఆకర్షణకు గురైనా ఈ యువరాణి అతనితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. షమన్ తో అనుబంధం కారణంగా ఆమె 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకత తెలిపారు. దీంతో ఆమె కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని గమనించిన లూయిస్ తాను డ్యూరెక్ తోనే కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు ‘ఇన్ స్ట్రాగ్రామం’ ద్వారా తెలిపారు.
నార్వే రాయల్ ప్యాలెస్ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నట్లు, ఇకపై రాజరికంలో తనకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే రాజు కోరిక మేరకు ఆమెను యువరాణిగా పిలిచేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నార్వే రాజు హరాల్డ్ మాట్లాడుతూ ‘యవరాణి లూయిస్ ఇకపై రాయల్ కుటుంబానికి ప్రాతినిథ్యం వహించదు’ అని ప్రకటించారు. ఆ విషయాన్ని చెప్పేందుకు చింతిస్తున్నామని తెలిపింది.

మార్థా లూయిస్ 2002లోనే క్లైర్ వాయింట్ గా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్ ను కోల్పోయారు. ఆ తరువాత 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్ ను ఉపయోగించనని పేర్కొన్నారు. ఇక ఆధ్యాత్మిక గురువు షమన్ తో గత జూన్ లో అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో లూయిస్ ఆయనతో కలిసి థెరపీలపై ప్రచారం చేశారు. తాజా ప్రకటన తరువాత ఇక నుంచి షమన్ తో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.