spot_img
Homeఎంటర్టైన్మెంట్Srihan Siri Marriage: బిగ్ బాస్ శ్రీహాన్ పెళ్లి? బర్త్ డే నాడు రింగ్ ఇచ్చి...

Srihan Siri Marriage: బిగ్ బాస్ శ్రీహాన్ పెళ్లి? బర్త్ డే నాడు రింగ్ ఇచ్చి సిరిని ఫిక్స్ చేసిన రొమాంటిక్ ఫెలో!

Srihan Siri Marriage: శ్రీహాన్-సిరి హన్మంత్ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. యూట్యూబ్ వేదికగా ఇద్దరికీ బంధం కలిసింది. షార్ట్ ఫిల్మ్స్, డాన్స్ వీడియోలు కలిసి చేస్తున్న సమయంలో మనసులు ముడి పడ్డాయి. తమ ప్రేమను వీరిద్దరూ బహిరంగంగానే ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి పాల్గొన్నారు. ఆమె ఫైనల్ కి కూడా వెళ్లారు. అప్పుడు సిరి కోసం బిగ్ బాస్ వేదికపైకి శ్రీహాన్ వచ్చాడు. ఆ నెక్స్ట్ సీజన్ శ్రీహాన్ బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేశాడు. సీజన్ 6 రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ సక్సెస్ వెనుక సిరి ఉందనేది నిజం. ఫ్యామిలీ వీక్లో సిరి హౌస్లోకి వెళ్ళింది. శ్రీహాన్ ఆటలోని తప్పొప్పులు వివరించి మంచిగా గైడ్ చేసింది.

Srihan Siri Marriage
Srihan Siri Marriage

సిరి వచ్చి వెళ్ళాక శ్రీహాన్ గేమ్లో చాలా మార్పు వచ్చింది. అలాగే బయట ఉండి శ్రీహాన్ కోసం క్యాంపైన్ చేసింది. శ్రీహాన్ టెంప్ట్ కాకపోతే ఏకంగా టైటిల్ కొట్టేవాడు. ఆత్మవిశ్వాసం లోపించడం, పేరెంట్స్, ఫ్రెండ్స్ రూ. 40 లక్షల క్యాష్ తీసుకొమ్మని మోటివేట్ చేయడంతో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. నాగార్జున ఆఫర్ కి ఒప్పుకొని సూట్ కేసు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు.

రన్నర్ అయినప్పటికీ… శ్రీహాన్ రూ. 45 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు. అలాగే ఒప్పందం ప్రకారం 15 వారాలు హౌస్లో ఉన్నందుకు మరికొంత డబ్బు, రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు. కాగా షో ద్వారా వచ్చిన డబ్బు నుండి లవర్ సిరికి గిఫ్ట్ ఇవ్వాలని శ్రీహాన్ చెప్పాడు. ఇప్పటివరకు నేను చెప్పుకోదగ్గ బహుమతి ఒక్కటి కూడా కొనలేదు. సిరి కోసం ఓ గిఫ్ట్ కొంటాను. అలాగే సొంతింటి కల నెరవేర్చుకుంటాను , అన్నాడు.

Srihan Siri Marriage
Srihan Siri Marriage

ఇటీవల సిరి బర్త్ డే శ్రీహాన్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెకు ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే అది వెడ్డింగ్ రింగ్… రొమాంటిక్ గా సిరిని పెళ్లికి ఒప్పించాడన్న ప్రచారం జరుగుతుంది. శ్రీహాన్-సిరి ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. కాగా గతంలో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందనే వాదన ఉంది. ఎటూ పెళ్లీడు కూడా దాటిపోతుండగా… వివాహ బంధంతో ఒక్కటవ్వాలని ఫిక్స్ అయ్యారట. సిరి-శ్రీహాన్ త్వరలో పెళ్లి ప్రకటన చేసే ఆస్కారం కలదనేది లేటెస్ట్ న్యూస్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో శేఖర్ మాస్టర్ నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ ప్రకటించారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version