
Balagam Awards: ఈమధ్య కాలం లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని సృష్టించిన చిన్న సినిమా ‘బలగం’. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా 50 లక్షల రూపాయిల గ్రాస్ తో మొదలై నేడు 30 కోట్ల రూపాయిల గ్రాస్ కి రీచ్ అయ్యింది.ఈమధ్యనే అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జోరు ఏమాత్రం కూడా తగ్గలేదు.
ఇప్పటికీ రోజుకి 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.చిన్నప్పటి నుండి తాను పుట్టి పెరిగిన తెలంగాణ పల్లెల్లోని వాతావరణాన్ని, అక్కడ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు వేణు.సినిమా చూసినప్పుడు కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని ఊహించలేదు కానీ, కచ్చితంగా జాతీయ పురస్కారాలు అందుకుంటుంది అని మాత్రం ఊహించారు.

ప్రేక్షకులు ఊహించినట్టు గానే ఈ సినిమాకి ఇప్పుడు అవార్డుల పర్వం మొదలైంది.ఇక అసలు విషయానికి వస్తే ప్రతీ ఏడాది లాస్ ఏంజిల్స్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్’ లో బెస్ట్ సినిమాటోగ్రఫీ మరియు బెస్ట్ ఫీచర్డ్ ఫిలిం గా ‘బలగం’ రెండు క్యాటగిరీలలో అవార్డులను సంపాదించింది.దీనిపై మూవీ టీం ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచింది.రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అవార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
విశ్లేషకులు చెప్పే మాట ఏమిటంటే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి ‘బలగం’ చిత్రాన్ని కూడా పంపాలని అంటున్నారు.ఎందుకంటే ఇలాంటి సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ రావడం ఈ ఏడాది మనం ‘ది ఎలిఫెంట్ విష్పెర్స్’ అనే సినిమాకి చూసాము.అలాగే బలగం చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి నామినేషన్స్ కోసం పంపితే కచ్చితంగా అవార్డు దక్కించుకుంటుంది అంటున్నారు.మరి దిల్ రాజు అలాంటి ప్రయత్నాలు చేస్తాడో లేదో చూడాలి.