Homeట్రెండింగ్ న్యూస్Survived On Sea: నడి సముద్రంలో చిక్కుకుని 24 రోజులు.. ఎలా బతికాడంటే ..!

Survived On Sea: నడి సముద్రంలో చిక్కుకుని 24 రోజులు.. ఎలా బతికాడంటే ..!

Survived On Sea
Survived On Sea

Survived On Sea: ప్రతికూల వాతావరణం ఓ నావికుడిని కరేబియన్‌ సముద్రం మధ్యలోకి తీసుకెళ్లింది. నావిగేషన్‌ వ్యవస్థ పని చేయకపోవడంతో అతడికి తీరంచేరే మార్గం తెలియలేదు. ఆహారం లేక కెచప్‌ తింటూ అక్కడే కొన్ని రోజులు గడిపాడు. చివరికి ఓ హెలికాప్టర్‌ అటుగా రావడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

డొమినికా వాసి ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌ ఓ నావికుడు. గత ఏడాది డిసెంబరులో అతడు పడవలో కరేబియ¯Œ సముద్ర ద్వీపం సెయింట్‌ మార్టిన్‌ వద్ద ఉన్న సమయంలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయి. భారీగా పెనుగాలులు వీస్తూ అతడి పడవ ఒడ్డు నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో పడవలోని నావిగేషన్‌ వ్యవస్థ కూడా పనిచేయలేదు. ఫ్రాంకోయిస్‌ వద్ద మొబైల్‌ ఉన్నా దానికి సిగ్నల్‌ అందలేదు. అలా పడవ ఎంత దూరం వరకు కొట్టుకెళ్తోందో కూడా అతనికి తెలియరాలేదు. ఫ్రాంకోయిస్‌ పడవలో ఒక కెచప్‌ సీసా, వెల్లుల్లి పౌడర్, కొంచెం మ్యాగీ మాత్రమే ఉన్నాయి. వాటిపై నీళ్లు చల్లుకొని తిని మొదటి రోజు గడిపాడు. కనుచూపు మేరలో నేల కనిపించడం లేదు. చుట్టూ నీరే.. దాంతో తనకు సమీపంగా ఎవరైనా వస్తారనే నమ్మకం కూడా ఫ్రాంకోయిస్‌ సన్నగిల్లింది. ఎవరైనా వస్తే వారు సహాయం చేయడానికి వీలుంటుందని కష్టపడి తన పడవపై ‘హెల్ప్‌’ అనే అక్షరాలు చెక్కాడు. అయినా అటుగా ఎవరూ రాలేదు. రోజులు, వారాలు గడుస్తున్నాయి. తినడానికి ఏమీ లేదు. కెచప్‌ తప్ప. దాంతో ఆకలి వేస్తే కెచప్‌ను కొద్ది కొద్దిగా తింటూ పడవలోనే ఒంటరిగా కాలం గడిపాడు. అలా 24 రోజులు గడిచాయి.

నేవీ హెలిక్యాప్టర్‌ రాకతో..
జనవరి 15న ఓ హెలికాప్టర్‌ తన పడవపై ఎగురుతూ వెళ్లడం ఫ్రాంకోయిస్‌ గమనించాడు. అప్పటికి పడవ ప్యూర్టో బొలివర్‌కు 120 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతం ఫ్రాంకోయిస్‌ మొదట ఉన్న ప్రదేశానికి దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉంది. హెలికాప్టర్‌ను చూడగానే ఫ్రాంకోయిస్‌ ఆశలు మళ్లీ చిగురించాయి. ముఖం చూసుకునేందుకు పడవలో ఉంచుకున్న చిన్నపాటి అద్దం బయటకు తీశాడు. దానిపై సూర్యరశ్మి పడి ఆ వెలుతురు హెలికాప్టర్‌లో ఉన్నవారికి తాకేలా కదిపాడు. పైన ఎగురుతోంది కొలంబియా నేవీ హెలికాప్టర్‌. వారు ఫ్రాంకోయిస్‌ కదలికలపై దృష్టిపెట్టారు. తనకు సహాయం అవసరం ఉందని భావించి హెలికాప్టర్‌ కాస్త కిందకి దించి ఫ్రాంకోయిస్‌ను రక్షించారు.

24 రోజులు కెచప్‌ తింటూ..
సరైన తిండి, నీరు లేకపోవడంతో ఫ్రాంకోయిస్‌ బాగా బలహీనపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కార్టాజెనా మెడికల్‌ కేర్‌కు తరలించారు. సముద్రంలో చిక్కుకున్న ఒంటరి నావికుడు 24 రోజులు కెచప్‌ తింటూ బతికాడనే విషయం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. తాను పడవలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఫ్రాంకోయిస్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘అదో కష్ట సమయం. ఎలాంటి ఆహారం లేదు. ఒక కెచప్‌ బాటిల్, గార్లిక్‌ పౌడర్, మ్యాగీ మాత్రమే ఉండేది. వాటినే నీళ్లలో నానబెట్టుకుని తిన్నా’ అని తన అనుభవాన్ని వివరించాడు. చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్న ఫ్రాంకోయిస్‌ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు.

Survived On Sea
Survived On Sea

నావికుడి కోసం కెచప్‌ కంపెనీ వెతుకులాట..
ఫ్రాంకోయిస్‌ కెచప్‌ తింటూ 24 రోజులు జీవనం సాగించిన విషయం సంచలనం కావడంతో హీన్జ్‌ అనే కెచప్‌ కంపెనీ తన కోసం వెతుకులాట ప్రారంభించింది. ఫ్రాంకోయిస్‌ ఆచూకీ తెలిస్తే చెప్పాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అంతటి సాహస చరిత్ర కలిగిన నావికుడికి తమ కంపెనీ తరఫున అధునాతన నావిగేషన్‌ వ్యవస్థ కలిగిన ఓ పడవను బహూకరించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఆ పిలుపునకు ఓ స్థానిక వార్తా సంస్థతోపాటు నెటిజన్లు స్పందించారు. లైక్‌లు, కామెంట్స్, షేర్స్‌ చేస్తూ ఆ పోస్టును వైరల్‌ చేశారు.

ఎట్టకేలకు ఫ్రాంకోయిస్‌ ఆచూకీ కెచప్‌ కంపెనీకి తెలిసింది. కంపెనీ తమ ప్రతినిధుల సహాయంతో రెండు రోజుల క్రితం నావికుడికి బోటును అందజేసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular