Kamareddy: ఒక్కోసారి మనం చేసే పనులు మనకే ఇబ్బందులు తెస్తాయి. లేని కష్టాలు అంటగడతాయి. రెడ్డిపేటకు చెందిన వీరు సరదాగా గడపాలని అడవిలోకి వెళ్లిన ఇద్దరు స్నేహితులు రాజు, మహేశ్ మంగళవారం సాయంత్రం సింగరాయపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుట్ట మీద సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో రాజు సెల్ ఫోన్ కింద పడటంతో దాన్ని వెతికేందుకు ఇద్దరు ప్రయత్నించే సందర్భంలో వారు సొరంగంలో ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చినా రాజు మాత్రం అందులోనే ఉండిపోయాడు. మహేశ్ రాత్రంతా అక్కడే ఉండి రాజుకు సహాయంగా ఉన్నాడు. అతడికి నీళ్లు, ఆహారం అందిస్తూ అక్కడే ఉండిపోయాడు.

విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుహలోనే రాజు 43 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ అధికారులు శ్రమించి రాజును బయటకు తీసుకురాగలిగారు. డ్రిల్లింగ్ మిషన్లు, జిలిటన్ స్టిక్స్తో బండలను పేల్చుతూ నాలుగు జేసీబీలతో బండరాళ్లను తొలగించుకుంటూ రెస్క్యూ నిర్వహించి రాజును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రాజు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సూచించారు.
అందరు 18 గంటల పాటు శ్రమించి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రాజు తలకిందులుగా చిక్కుకోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడికి అండగా గ్రామస్తులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు నిలిచారు. ఎప్పటికప్పుడు అతడిని పలకరిస్తూ భయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. జాగ్రత్తగా బండరాళ్లను తొలగించి అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. రాత్రంతా కూడా అతడికి భయం కలగకుండా అందరు ఉండటంతో సురక్షితంగా బయట పడ్డాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

సరదా కోసమని వెళితే ప్రమాదంలో చిక్కుకోవడం యాదృచ్ఛికం. సెల్ ఫోన్ కోసం వెతికే క్రమంలో గుహలో ఇరుక్కోవడంతో సమస్య ఏర్పడింది. బండరాళ్లలో ఇరుక్కుని నరకయాతన అనుభవించిన రాజును బయటకు తీసుకొచ్చేందుకు అందరు చేసిన కృషి ఎంతో విలువైనది. గుహ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి అతడికి కలిగిన కష్టాన్ని తొలగించారు. విరామం లేకుండా విశ్రమించి రాజు ప్రాణాలు కాపాడారు. 43 గంటల పాటు కష్టపడి అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.