Pawan Kalyan- Ali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే… టక్కున అలీ పేరు చెబుతారు. జల్సా చిత్రం తర్వాత పవన్ కి త్రివిక్రమ్ కూడా సన్నిహితుడు అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ నుండి తోడుగా ఉన్న నటుడు అలీ. పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత తో వీరి ప్రయాణం మొదలైంది. తొలిప్రేమ సినిమాతో మరింత బలపడింది. పవన్-అలీ ఎంత తిక్ ఫ్రెండ్స్ అయ్యారంటే… పవన్ సినిమా అంటే అలీకి ఇక పాత్ర ఉండాల్సిందే. అలా పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన ప్రతి సినిమాలో అలీ నటించారు.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా వారి బంధం కొనసాగింది. 2014లో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అలీ జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మద్దతు తెలపలేదు, అలా అని వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ తో తన సినిమా జర్నీ సాగించారు. కాగా 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు.
ఈ క్రమంలో రాజకీయ ఆరోపణలు చోటు చేసుకున్నాయి. తాను పూర్తిగా వ్యతిరేకించే పార్టీలో అలీ చేరినా పవన్ మిత్రుడిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఎవరి సిద్దంతాలు వాళ్ళవి కాబట్టి, వైసీపీ పార్టీలో చేరడం అలీ వ్యక్తిగత విషయంగా పవన్ కళ్యాణ్ చూశారు. ఎవరో మాటలు విని అలీనే ఒకటి రెండు సందర్భాల్లో పవన్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ కారణంగా పవన్-అలీ మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది.

ఇటీవల అలీ కూతురు వివాహం జరిగింది. ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. దీంతో మరోసారి పవన్-అలీ విబేధాల కథనాలు తెరపైకి వచ్చాయి. నిజంగా ఏం జరిగింది? అలీని నిజంగా పవన్ దూరం పెట్టారా? ఒక వేళ గ్యాప్ వస్తే కారణాలు ఏమిటీ? తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ క్రమంలో అలీ స్పందించారు. ఆలీతో సరదాగా 350వ ఎపిసోడ్ కి తానే గెస్ట్ గా వచ్చాడు అలీ. స్టార్ యాంకర్ సుమ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. అలీ కెరీర్ బిగినింగ్ నుండి అనేక ఆసక్తికర విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సుమ అందరూ కోరుకుంటున్న ప్రశ్న అడగనే అడిగారు. మీకు పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తో నాకు గ్యాప్ రాలేదు,సృష్టించారని సమాధానం చెప్పాడు అలీ. ఈ వివాదానికి సంబంధించి అలీ పూర్తి వివరణ తెలియాలంటే వచ్చే వారం ఎపిసోడ్ చూడాలి.
https://www.youtube.com/watch?v=KYTnRFGnEo0