Mosquito Bite: దోమ చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. కానీ అది కుట్టిందంటే మనిసి ప్రాణాలే పోవడం కామనే. అలాంటి సంఘటనలు కోకొల్లలు. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. డెంగీ ఓ దోమ కాటు వల్ల వ్యాపించే వ్యాధే. కానీ దానితో ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటాయి. మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు కూడా దోమల కాటు వల్ల వచ్చేవే. ఇలా మనుషుల ప్రాణాలతో ఆటలాడుకోవడం వాటికి అలవాటే. ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలే పోవడం చూస్తున్నాం. దోమల బారి నుంచి రక్షించుకునేందుకు మనం నానా తంటాలు పడుతుంటాం. అయినా వాటికి దొరికి పోతున్నాం. ఆపదలు కొని తెచ్చుకుంటూనే ఉన్నాం.

తాజాగా జర్మనీలో ఆసియా టైగర్ దోమ కాటు వేయడంతో ఓ వ్యక్తి పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. సెబాస్టియన్ (27) అనే వ్యక్తికి దోమ కాటు వేసింది. దీంతో సాధారణ జ్వరం వచ్చింది. అది ఎంతకీ తగ్గకపోవడంతో విషంగా మారింది. నాలుగు వారాల పాటు కోమాలోకి వెళ్లాడు. దీంతో శరీర భాగాలు అన్ని పాడైపోయాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం అన్ని భాగాలు చెడిపోయాయి. దోమ కుట్టిన చోట ఏర్పడిన గడ్డను తొలగించుకునేందుకు అతడు 30 సర్జరీలు చేసుకోవాల్సి రావడం గమనార్హం. దోమ కాటు వల్ల ఇన్ని ఇబ్బందులొస్తాయనే విషయం మనకు కూడా తెలియదు.
కానీ ఇది నిజం. అక్షరాల జరిగిన సంఘటన. దీంతో జర్మన్లు వణుకుతున్నారు. దోమలను చూస్తే బెదిరిపోతున్నారు. ఇంతటి విషం కలిగించే దోమల నుంచి రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏ దోమ వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే బెంగ వారిలో వస్తోంది. దోమ కాటు ఇంత దారుణంగా ఉంటుందా? మనిషిని ఇంతలా బాధిస్తాయా? అనే ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం జర్మన్లను దోమలు సైతం భయపెడుతున్నాయి. ఏ దోమ కుడితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది.

జర్మనీలో దోమలు ఉండొద్దని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. దోమలకు ఆవాసాలుగా ఉండే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. చెత్త చెదారం ఉండకుండా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. దేశమంతా ఒక ఉద్యమంలా దోమల నివారనకు నడుం బిగిస్తున్నారు. దోమ కాటు వల్ల ఇంతటి పెను విపత్తు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. దోమలను నిర్లక్ష్యం చేస్తే అవి మన ప్రాణాల్నే హరిస్తున్నాయనే విషయం బోధపడటంతో అక్కడి ప్రభుత్వం మేల్కొంది.