Homeఆంధ్రప్రదేశ్‌AP BJP: అదును చూసి బీజేపీని వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు వర్గం నేతలు

AP BJP: అదును చూసి బీజేపీని వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు వర్గం నేతలు

AP BJP
AP BJP

AP BJP: ఇన్నాళ్లు ఆ పార్టీని వాడుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా వ‌దిలేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది. ఇంత‌లోనే త‌ట్ట బుట్ట స‌ర్దుకుంటున్నారు. పోతు.. పోతు నాయ‌క‌త్వం పై పెద‌వి విరుస్తున్నారు. వారితో వేగ‌లేం అంటూ నిట్టూర్పులు వెల్ల‌గ‌క్కుతున్నారు. అదును చూసి బ‌య‌టికొస్తున్నారు. అవ‌స‌రం తీరాక జారుకుంటున్నారు. ఇంత‌కీ ఆ పార్టీలో ఏం జ‌రుగుతోంది ? జంప్ జిలానీలు ఇంకెంత‌మంది ? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్.

ఏపీ బీజేపీలో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఇన్నాళ్లు ఆహా.. ఓహో అంటూ పొగిడిన నేత‌లు ఇప్పుడు పార్టీ నుంచి బ‌య‌టికెళ్తున్నారు. మూడున్న‌రేళ్లు పార్టీలో సర్దుకుపోయిన నేత‌లు.. తాజాగా ఫిరాయింపుల ప‌ర్వానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ రాజీనామాతో క‌ల‌క‌లం రేగింది. క‌న్నా అనుచ‌రులు మూకుమ్మ‌డిగా బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో ఇమ‌డ‌లేం అంటూ క‌న్నా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు వైఖ‌రితో విసిగిపోయిన‌ట్టు ప్ర‌క‌టించారు. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ త్వ‌ర‌లో టీడీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని తెలుస్తోంది.

క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ బీజేపీకి రాజీనామా చేయ‌డంతో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేసింది. ఎన్నిక‌ల ముందు ఓ వ‌ర్గం నేత‌లు ఒక్కొక్క‌రిగా బ‌యటికొస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బీజేపీలో రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం ఉంది. అందులో చంద్ర‌బాబు వ‌ర్గం ఒక‌టి ఉంద‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఇప్పుడు క‌న్నా రాజీనామాతో చంద్ర‌బాబు వ‌ర్గం నేత‌లు బీజేపీని ఒక్కొక్క‌రుగా వ‌దులుతున్నార‌న్న టాక్ న‌డుస్తోంది. క‌న్నా త‌ర్వాత పురందేశ్వ‌రి కూడా పార్టీ మార‌నుందా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు కుటుంబానికి దూరంగా ఉన్న పురందేశ్వ‌రి కుటుంబం.. ఇటీవ‌ల బాగా ద‌గ్గ‌ర‌యింది. ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రి కూడా టీడీపీ వైపు చూస్తున్నారా ? అన్న చ‌ర్చ లేక‌పోలేదు.

AP BJP
AP BJP

బీజేపీలో చంద్ర‌బాబుకు బ‌ల‌మైన వ‌ర్గ‌ముంద‌ని ఇటీవ‌ల వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా చెప్పారు. వైఎస్ వివేకా హ‌త్య కేసు సీబీఐ విచార‌ణ సంద‌ర్భంగా.. సీబీఐ అనుమానితుల్ని ఏం ప్ర‌శ్న‌లు అడుగుతుందో ముందే చంద్ర‌బాబుకు, ఆయ‌న సంబంధిత మీడియాకు ముందే తెలుస్తున్నాయ‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. సీబీఐ విచార‌ణ‌లో ఉన్న విష‌యాలో బీజేపీలోని చంద్ర‌బాబు వ‌ర్గం ద్వారానే తెలుస్తున్న‌ట్టు స‌జ్జ‌ల ఆరోపించారు. దీనిని బ‌ట్టి బీజేపీలో చంద్ర‌బాబు వ‌ర్గం ఎంత బ‌లంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల పొత్తుకు కూడా బీజేపీలోని చంద్ర‌బాబు వ‌ర్గం బ‌లంగా ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు వ‌ర్గ ప్ర‌య‌త్నాల‌కు సోమువీర్రాజు టీం మోకాలొడ్డిన‌ట్టు స‌మాచారం. దీంతో పొత్తు పొడువ‌కుండానే ముగిసిపోయింది.

టీడీపీ,జ‌న‌సేన‌, బీజేపీ పార్టీలు క‌లిసి ఎన్నిక‌లు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని తేలిపోయింది. బీజేపీలో చంద్ర‌బాబు వ‌ర్గం నేత‌లకు ఈ విష‌యం బోధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేశ మూడు పార్టీల పొత్తు కుదిరి ఉంటే. . చంద్ర‌బాబు వ‌ర్గం నేత‌ల‌కు అవ‌కాశాలు ద‌క్కేవి. ఇప్పుడు ఎలాంటి అవ‌కాశం లేదు. అందుకే ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్న‌ట్టు స‌మాచారం. క‌న్నా బాట‌లోనే మ‌రికొంత మంది బీజేపీ నేత‌లు న‌డిచే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా అదును చూసి బీజేపీని వీడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మూడున్న‌రేళ్లు గ‌డిచాక ఎన్నిక‌ల ముందు తెప్ప తిర‌గేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. బీజేపీలోని ఫిరాయింపుదారుల దారి చంద్ర‌బాబు ఇంటికేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

జనసేన గుండెల మీద చేయివేసుకుని ఆత్మ సమీక్ష చేసుకోవాలి || Analysis on Pawan Kalyan Janasena Party

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version