Shiaji Shinde Kota: యముడిగా షియాజీషిండే సూట్ అవుతాడా? షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా శ్రీనివాసరావు

Shiaji Shinde Kota: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప గొప్ప నటులున్నారు. కానీ మన తెలుగు సినిమాల్లో వారిని కాదని పరభాష నటులను తీసుకొచ్చి మరీ పెడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తెలుగు వారు అస్సలు ఉండరు. దీన్ని ఎంతో మంది ఖండించినా.. గొంతు చించుకున్నా ప్రయోజనం అయితే లేదు. ఈ విషయంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఎప్పటి నుంచో నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

Written By: NARESH, Updated On : May 12, 2022 6:21 pm
Follow us on

Shiaji Shinde Kota: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప గొప్ప నటులున్నారు. కానీ మన తెలుగు సినిమాల్లో వారిని కాదని పరభాష నటులను తీసుకొచ్చి మరీ పెడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తెలుగు వారు అస్సలు ఉండరు. దీన్ని ఎంతో మంది ఖండించినా.. గొంతు చించుకున్నా ప్రయోజనం అయితే లేదు. ఈ విషయంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఎప్పటి నుంచో నిరసన తెలుపుతున్నారు.

తాజాగా ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఇతర ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో మంచి గుర్తింపు ఉన్న నటులను తెలుగు సినీ ఇండస్ట్రీలో తీసుకోవడంలో తప్పులేదు కానీ మామూలు నటులను కూడా తీసుకొని వారికి కీలక పాత్రలు ఇవ్వడం సరైంది కాదని కోటా వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే మరాఠి నటుడు షాయాజీ షిండే గురించి హాట్ కామెంట్స్ చేశాడు. విచిత్రమైన స్లాంగ్ తో డిఫెరెంట్ గా మాట్లాడే షాయాజీ షిండే గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా సినిమాల్లో అద్భుతమైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్లు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

ఇతర ఇండస్ట్రీకి చెందిన షిండేకు తెలుగులో ‘యముడికి మొగుడు’ సినిమాలో యముడు క్యారెక్టర్ ఇవ్వడం ఏంటి అంటూ కోటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. అందుకే తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడించారు. పరభాష నటుడికి కీలక పాత్ర ఇచ్చి తెలుగు నటులకు తక్కువగా చూసినందుకే ఆ సినిమా నుంచి వైదొలిగినట్లు తెలిపారు. కోటా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.