https://oktelugu.com/

Odisha Wife And Husband: మంత్రగాడికి భార్యను అప్పగించిన భర్త.. చివరకు ఏం జరిగింది?

Odisha Wife And Husband: మూఢనమ్మకాల జాడ్యం ఇంకా పోవడం లేదు. మనిషి తన మేధస్సుతో ఎన్నో కనుగొంటున్నా మంత్రాల మీద మాత్రం పట్టు సాధించడం లేదు. ఫలితంగా కట్టుకున్న వాళ్లను సైతం బందీలుగా చేస్తూ కర్కశత్వాన్ని అనుభవిస్తున్నారు. జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాల్సిన భర్తే మంత్రగాడి దగ్గర వదిలేయడం చర్చనీయాంశం అయింది. సదరు మంత్రగాడు ఆమెపై ఏకంగా 79 రోజుల పాటు అత్యాచారం చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 8, 2022 / 09:00 AM IST
    Follow us on

    Odisha Wife And Husband: మూఢనమ్మకాల జాడ్యం ఇంకా పోవడం లేదు. మనిషి తన మేధస్సుతో ఎన్నో కనుగొంటున్నా మంత్రాల మీద మాత్రం పట్టు సాధించడం లేదు. ఫలితంగా కట్టుకున్న వాళ్లను సైతం బందీలుగా చేస్తూ కర్కశత్వాన్ని అనుభవిస్తున్నారు. జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాల్సిన భర్తే మంత్రగాడి దగ్గర వదిలేయడం చర్చనీయాంశం అయింది. సదరు మంత్రగాడు ఆమెపై ఏకంగా 79 రోజుల పాటు అత్యాచారం చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

    Odisha Wife And Husband

    ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఓ బాబు జన్మించాడు. అతడి వయసు రెండు సంవత్సరాలు. అయితే బాబు పుట్టాక వారి సంసారంలో కలతలు పెరిగాయి. రోజురోజుకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం పెరిగాయి. ఇవి కాస్త పెద్దగా మారడంతో ఇక ఏం చేయాలనే దానిపై చర్చించుకున్నారు.చివరకు ఓ మంత్రగాడి దగ్గరకు వెళ్లారు.

    Also Read: Summer Precautions: మండే ఎండలతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    దీనికి పరిష్కారం ఏమిటని అడిగారు. దానికి అతడు మీ భార్యను రెండు నెలలు తన దగ్గర వదిలేస్తే దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మబలికాడు. దీంతో భర్త అతడి తల్లి పిల్లవాడిని, తల్లిని మంత్రగాడికి అప్పగించి వచ్చేశారు. దీంతో అతడు రెండు నెలలుగా ఆమెను బందీగా చేసుకుని అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. దాదాపు 79 రోజులుగా ఆమెపై పైశాచికంగా లైంగిక దాడి కొనసాగిస్తున్నాడు.

    Odisha Wife And Husband

    నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెకు ఏ దారి కనిపించలేదు. మంత్రగాడు సెల్ ఫోన్ రూంలోనే మరిచిపోవడంతో ఆమె తన తల్లికి జరిగిన విషయం వివరించింది. దీంతో వారు పోలీసులను తీసుకుని వెళ్లి ఆమెను విడిపించారు. మంత్రగాడు, ఆమె భర్త, అతడి తల్లి తప్పించుకుని పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

    Also Read:Sarkaru Vaari Paata- Mahesh Gets Teary: అందరిముందే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు.. ఏం జరిగింది?

    Recommended Videos:

    Tags