Theatres In Hyderabad: దేశంలో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దీంతో నగరాలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడం గమనార్హం. దీంతో పెరుగుతున్న జనాభాకనుగుణంగా పరిధి కూడా పెంచాల్సి వస్తోంది. సహజంగా తెలుగువారు ఆనందానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకేు సినీ పరిశ్రమ నగరంలో స్థిరపడింది. ఒకప్పుడు మద్రాస్ వేదికగా ఉన్న పరిశ్రమ ప్రస్తుతం నగరంలోనే విస్తరిస్తోంది. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా థియేటర్లు కూడా పెంచాల్సి ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
నగరంలో ఇప్పటికే మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. కానీ భారీగా జనాభా పెరగడంతో సరిపోవడం లేదు. దీంతో వాటిని విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా తొమ్మిది తెరలతో అధునాతన హంగులతో మల్టీప్లెక్స్ లు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి నగరంలో మరో రెండు మల్టీప్లెక్స్ లు రెడీ కానున్నాయి. దీంతో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
Also Read: Odisha Wife And Husband: మంత్రగాడికి భార్యను అప్పగించిన భర్త.. చివరకు ఏం జరిగింది?
మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలకు ప్రభుత్వాలు స్వేచ్ఛ ఇవ్వడంతో రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారు. దీంతో లాభాల పంట పండిస్తున్నారు. అందుకే ప్రేక్షకుల కోసం కలర్ ఫుల్ మల్టీప్లెక్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, కూకల్ పల్లి ఏరియాల్లో భారీ మల్టీప్లెక్సులున్నా సినీ ప్రియుల కోసం అన్ని ఏరియాల్లో మల్టీప్లెక్సుల స్క్రీన్లను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.
2023 సంక్రాంతి నాటికి నగరంలో 20 కొత్త స్క్రీన్లు రెడీ కానున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓడియన్ థియేటర్ కు ఎంత చరిత్ర ఉందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంప్లెక్సులో తొమ్మిది తెరలతో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు కనువిందు కానుంది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా మల్టీప్లెక్సుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో 11 స్క్రీన్లతో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇంత భారీ స్క్రీన్లతో నిర్మించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. మొత్తానికి నగరంలో మల్టీప్లెక్సుల సందడి కొనసాగనుంది. ఒకప్పుడు థియేటర్లతోనే సర్దుకునన జనం ఇప్పుడు మల్టీప్లెక్సులకు అలవాటు పడ్డారు. దీంతో యాజమాన్యాలు కూడా ప్రేక్షకుల కోరిక మేరకు అన్ని హంగులు సమకూర్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Posani Krishna Murali: పోసాని పశ్చాతాపం.. మారిన పవన్ పై అభిప్రాయం !