
Kate Winslet: టైటానిక్ అద్భుత ప్రేమ కావ్యం. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్. ఆ చిత్ర హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఒక అప్సరస. దశాబ్దాల పాటు కేట్ విన్స్లెట్ గురించి ప్రపంచం చెప్పుకుంది. ఆమెను అందానికి చిరునామాగా కొనియాడేవారు. మారుమూల పల్లెల్లో కూడా టైటానిక్ హీరోయిన్ అంటే తెలియనివారు ఉండేవారు కాదు. రోజ్ పాత్రలో కేట్ విన్స్లెట్ జీవించారు. ఇక జాక్ పాత్ర కూడా అదే స్థాయిలో ప్రాచుర్యం పొందింది. రోజ్ లవర్ జాక్ పాత్ర చేసిన లియోనార్డో డికాప్రియో సైతం టైటానిక్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
టైటానిక్ మూవీలో వీరి ప్రేమ కథ ఎంత చక్కగా కుదిరిందో… ఆ పాత్రలకు కేట్, లియోనార్డో అంతగా సెట్ అయ్యారు. టైటానిక్ అనంతరం ఈ జంట ఓ పదేళ్ల తర్వాత జతకట్టారు. 2008లో వీరి కాంబినేషన్ లో రివల్యూషనరీ రోడ్ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన రివల్యూషనరీ రోడ్ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో శృంగార సన్నివేశాల్లో కేట్, లియోనార్డో నటించారు.
అనూహ్యంగా ఈ చిత్ర దర్శకుడు కేట్ భర్త సామ్ మెండిస్. దీంతో ఆయన ఎదురే లియోనార్డోతో ఆమె శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఈ విషయంపై కేట్ మాట్లాడారు. కట్టుకున్న భర్త ఎదుట పర పురుషుడితో శృగారం చేయాల్సి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆమె వెల్లడించారు. రివొల్యూషనరీ రోడ్ మూవీలో లియోనార్డోతో నేను శృంగార సన్నివేశాల్లో నటించాను. ఎదురుగా నా భర్త ఉన్నారు. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరమైన, విచిత్రమైన ఫీలింగ్ కలిగింది… అని కేట్ అన్నారు.

ఎంత సినిమా అయినప్పటికీ కట్టుకున్న భర్త ఎదుటే ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం అంటే సాధారణ విషయం కాదు కదా. పలు చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించిన కేట్ కూడా అసౌకర్యంగా ఫీల్ అయ్యారట. సామ్ మెండిస్ ఆమెకు రెండో భర్త. 1998లో జిమ్ అనే దర్శకుడిని ఆమె వివాహమాడారు. అనంతరం 2001లో సామ్ మెండిస్ ని వివాహం చేసుకున్నారు. మెండిస్ తో కూడా విడిపోయిన కేట్ 2012లో మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.