https://oktelugu.com/

Groom: 15 లక్షలకు శోభనం.. నువ్వే మగాడివిరా స్వామీ

ఇంజనీర్ గా పనిచేస్తున్న అవినాష్ వర్మతో 2022, జూన్ 6న యువతికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలు, ఇతర లాంఛనాలు వద్దని చెప్పడంతో అల్లుడు ఎంతో మంచి వాడని మురిసిపోయారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 7, 2024 / 12:50 PM IST

    Groom

    Follow us on

    Groom: పెళ్లికి ముందు కట్న కానుకలు వద్దన్నాడు. పిల్లని ఇస్తే చాలని నమ్మబలికాడు. పువ్వుల్లో పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ పెళ్లయ్యాక నరకం చూపిస్తున్నాడు. కట్నం లేనిదే శోభనం కూడా చేసుకోనని చెప్పడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది. దీంతో వారు పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఇంజనీర్ గా పనిచేస్తున్న అవినాష్ వర్మతో 2022, జూన్ 6న యువతికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలు, ఇతర లాంఛనాలు వద్దని చెప్పడంతో అల్లుడు ఎంతో మంచి వాడని మురిసిపోయారు. వివాహం తరువాత అవినాష్ వర్మలో అసలు మనిషి బయటకు వచ్చాడు. కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తాళలేక అమ్మాయి తల్లిదండ్రులు 5.8 లక్షలు సమర్పించుకున్నారు. అయినా సంతృప్తి చెందని అవినాష్ తాను అడిగిన రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని తేల్చి చెప్పాడు.

    గత కొద్ది రోజులుగా బాధిత యువతిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఇటీవల ఆ వేధింపులు శృతిమించుతున్నాయి. బాధిత యువతి కుటుంబ సభ్యులు పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత యువతి పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.