Eurotunnel: సముద్ర మార్గం నుంచి ప్రయాణిస్తున్న ఓ రైలు మధ్యలో ఆగిపోతే .. వినడానికే భయంకరంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశానికి ఇంగ్లండ్ వేదికైంది. ప్రయాణికులు ఊపిరి బిగపట్టుకున్నారు. ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. అసలు ప్రాణాలతో బయటపడతామో లేదో అనే ఆందోళన అందరిలో కనిపించింది. కొందరైతే ఏడ్చారు. తమకు జన్మ ఉంటుందో లేదో అని కంట కన్నీరు కార్చారు అంతలా అందరిని భయపెట్టిన ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 3.50 గంటలకు చోటుచేసుకుంది.

ఫ్రాన్స్ లోని కలైస్ నుంచి ఇంగ్లండ్ లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఇంగ్లిష్ చానల్ కింద ఒకసారిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఐదారు గంటలు వేచి చూశారు. చివరకు అత్యవసర సేవల ద్వారా సురక్షితంగా బయటకు రాగలిగారు. అనంతరం ఎవరి గమ్య స్థానాలకు వారు వెళ్లిపోయారు. సముద్ర గర్భం గుండా వెళ్లే రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో అందులో ఉండేవారి గుండె ఆగినంత పనైంది.
యూరో టన్నెల్ లో షటిల్ సర్వీస్ రైలు అలారం ఆగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం తిరిగి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలుస్తోంది. తరువాత రైలును సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అందరిలో భయాందోళనలు కనిపించాయి. తాము బతికి బయట పడతామో లేదోననే బెంగ అందరిలో పట్టుకుంది. రైలు ఆగిపోవడం కొందరిని భయపెట్టింది.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సముద్ర గర్భంలో చిక్కుకోవడంపై భయంతో కన్నీరు పెట్టుకున్నారు. సముద్ర గర్భంలో అందరం చిక్కుకోవడంతో తమ ప్రాణాలు ఉంటాయో పోతాయో అని ఆందోళన నెలకొంది. మొత్తానికి ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. ఐదారు గంటల పాటు నరకం అనుభవించారు. ఏం జరుగుతోందో అనే ఆందోళన అందరిలో కనిపించింది. దీంతో ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు. సముద్రం కింద క్యూ కట్టి పరుగులు పెట్టారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఆరాటపడ్డారు.