
Ravanasura First Review: వరుసగా ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.ఈ చిత్రం 7 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాడు అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.
కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ఇవ్వడమే.రవితేజ సినిమా అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారు.టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుంది అంటే అందుకు కారణం ఫ్యామిలీ ఆడియన్స్.అలాంటి ఆడియన్స్ ఈ సినిమాకి A సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కట్ అయ్యిపోతారని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఈ సినిమాని చూసిన వెంటనే సెన్సార్ సభ్యులు 25 చోట్ల ట్రిమ్మింగ్ చేయాల్సిందిగా మూవీ యూనిట్ కి చెప్పిందట.కానీ డైరెక్టర్ సుధీర్ వర్మ అందుకు ఒప్పుకోలేదు,ఆ 25 చోట్ల ట్రిమ్ చేస్తే, సుమారుగా 20 నిమిషాల వ్యవధి ఉన్న సన్నివేశాలు పోతాయి, సినిమా కి ఉన్న ఫ్లో చెడిపోతుంది అనే ఉద్దేశ్యం తోనే డైరెక్టర్ ఒప్పుకోలేదట.దాంతో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ని జారీ చేసారు.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ షో లాగ ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా షో వేసి చూపించారట.వాళ్ళ నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.రవితేజ కెరీర్ లోనే ఈ సినిమా మరో బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని, ఆయనకి హ్యాట్రిక్ హిట్ తగలబోతోంది ఈ సందర్భంగా మూవీ యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారట.మరి వాళ్ళు చెప్పినట్టు గానే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి.