
Adivaram With Star Maa Parivaram: మధ్య కాలం లో బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ డ్రామా బాగా పెరిగిపోయింది. డ్రామా లేకపోతే TRP రేటింగ్స్ రావని కాబోలు,డైరెక్టర్స్ కూడా ఎక్కువ డ్రామాకే పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డ్రామా ని కూడా పండిస్తూ ప్రతీ వారం స్టార్ మా లో ప్రసారం అవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో కి మంచి ఆదరణ దక్కింది. ఈ షో ముక్కు అవినాష్ మరియు ఫైమా కలిసి వచ్చిన గెస్ట్స్ తో సరదాగా ఆట పట్టించే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.
వచ్చిన గెస్ట్స్ తో వివిధ గేమ్స్ ని ఆడిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచుతుంది ఈ షో.ఈ షో కి యాంకర్ గా శ్రీ ముఖి వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా రేపు జరగబొయ్యే ఈ షో కి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.
ఈ ఆదివారం ఈ ప్రోగ్రాం కి బిగ్ బాస్ బ్యూటీ లు అరియనా గ్లోరీ, అషు రెడ్డి, భాను మరియు ఇనాయ సుల్తానా వంటి వారితో పాటుగా, జబర్దస్త్ కమెడియన్స్ సద్దాం, బులెట్ భాస్కర్, యాదమ్మ రాజు , జ్ఞానేశ్వర్ వంటి వారు హాజరయ్యారు.వీళ్లంతా రెండు టీమ్స్ గా విడిపోయి గేమ్స్ ఆడుతారు. అయితే ప్రతీ ఆదివారం ఈ షోలో సందడి చేసే అవినాష్ మరియు ఫైమా ఈ ఎపిసోడ్ కి హాజరు కాలేదు.వాళ్ళ బదులుగా ఎక్స్ ప్రెస్ హరి వచ్చాడు.ఇతగాడు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

సరదాగా సాగిపోతున్న ఈ షో లో హరి చేసిన ఒక పని వల్ల మొత్తం షో మూడ్ మారిపోతుంది.అతను అషు రెడ్డి కి ముద్దు పెట్టాలని వస్తాడు. ఆ తర్వాత అతను మోకాళ్ళ మీద కూర్చొని అషు రెడ్డి కి ప్రపోజ్ చేస్తాడు.అషు రెడ్డి ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవని చెప్పినా కూడా అతను బ్రతిమిలాడడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
