Lecturer Madhu: బతకలేనివాడు బడి పంతులు అవుతారు అని తెలిసి తెలియని వారు చాలామంది అంటూ ఉంటారు. కానీ అలాంటి వారు తెలుసుకోవలసినది ఏమిటి అంటే టీచర్ అనే ప్రొఫెషన్ లేకపోతే అసలు మన ప్రపంచమే లేదు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా తన మొదటి అక్షరం నేర్చుకునేది గురువు దగ్గర నుంచే. అందుకే అన్ని వృత్తుల్లోకి టీచర్ వృత్తి అనేది చాలా గొప్పది. కాగా ఈ మధ్య ఎంతో మంది టీచర్ అవ్వాలి అనే కోరికతో తమకు వచ్చే ఉద్యోగాలు కూడా వదిలి అందులో చేరుతున్నారు. అంతెందుకు మన ఇండియాలో టీచర్ అంటే తక్కువ చూపేమో కానీ ఫారిన్ కంట్రీస్ లో అన్ని ఉద్యోగాల కన్నా టీచర్ ఉద్యోగాలకే జీతాలు ఎక్కువ.
ఇక ఇప్పుడు ఇలానే ఏమాత్రం తీసిపోము అని రుజువు చేశారు మనకు మరో టీచర్. అంతేకాదు ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత కూడా తామంటే ఏమిటో రుజువు చేయొచ్చు అని కూడా తన జీవితం ద్వారా తెలిపి ఉదాహరణగా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరు అంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక సాధారణ మహిళ మధు.
కొంతమంది మధు చదువుకుంటామని చెబితే హేళన చేసేవాళ్లు. కానీ ప్రస్తుతం మాత్రం ఆమె కథ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు మధు పిల్లలకు ఒక స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వలేదు.అయితే ఇప్పుడు మధు పిల్లలు ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇంతకీ ఆమె కథ ఏమిటో ఆమె మాటల్లోనే విందాం.
మధు మాట్లాడుతూ ‘మేము ఆరుగురు తోబుట్టువులమని నాలుగేళ్ల వయస్సులో తండ్రి చనిపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇంటర్ పూర్తి అయ్యింది పెళ్లి చేసేసారు.
నా భర్త వర్కర్. ఆయన సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోయేది’ అని తన కష్టాలు చెప్పుకొచ్చారు మధు.
ఆ సమయంలో కుట్టుపని మొదలుపెట్టానని కొంతకాలానికి భర్త జాబ్ పోయిందని ఆమె అన్నారు.
ఇక అదే సమయంలో నా పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చేర్పించాలని వెళితే ఫీజులు కట్టలేరని చేర్చుకోలేదని, మరో పక్క తాను చదువుకుంటాను అని చెప్పితే బంధువులు, అత్త ఆమెను తిట్టేవారని మధు తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.
కానీ జీవితం తనకు విసిరిన సవాళ్లను సైతం ఎదిరించి మధు చదువుకోవడం ప్రారంభించింది. ఒకపక్క పనులు చేస్తా ఎంతో కష్టపడి చదివి మధు నెట్ లో అర్హత సాధించారు. అంతేకాదు తన చదువు .. అలానే తన పిల్లల చదువు ఇక తన భర్త ఆరోగ్యం కోసం ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ మరోపక్క చదువుకుంటూ వచ్చారు మధు. తన పట్టుదలతో పొలిటికల్ సైన్స్ లో ఎం.ఏ చేసిన మధు పీహెచ్డీకి అడ్మిషన్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం లెక్చరర్ గా చేస్తున్న మధు .భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకుని పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
జీవితం అనేది ఎన్నో కష్టాలను తన పైన వేసిన మధు మాత్రం బెదరలేదు. పాచి పనులు చేసుకునే దగ్గర నుంచి లెక్చరర్ వరకు ఎదిగిన మధు సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చిన్న కష్టం వచ్చినా.. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన డిప్రెస్ అయిపోయే మనుషులకు.. మధు కథ అనేది ఆదర్శం అలానే ప్రోత్సాహం.