Sreeleela On SIIMA Awards: పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం చిన్న హీరోలని కాదు పెద్ద హీరోలని కాదు.. దాదాపు అంచనాలు ఉండే ప్రతి తెలుగు సినిమాలో శ్రీ లీలానే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 12 సినిమాలు ఒకేసారి సైన్ చేసింది అంటేనే ప్రస్తుతం తెలుగులో ఆమెకున్న క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీ లీల సైమా వేడుకల్లో ఒక బ్లాక్ అండ్ పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ తో ఈ హీరోయిన్ సందడి చేశారు. దీంతో అందరి దృష్టి శ్రీ లీల ధరించిన డ్రెస్ పైనే పడింది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అంటూ నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇక శ్రీ లీల ధరించిన ఈ బ్లాక్ అండ్ పింక్ కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్ కి చెందినది అని తెలుస్తోంది.
అంతేకాదు ఈ స్టైలిష్ డ్రెస్ ఖరీదు 35,600 రూపాయలని వినికిడీ. ఇలా శ్రీ లీల ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర ఏకంగా 35 వేల రూపాయలని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు శ్రీలైన ఈ డ్రెస్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంది అని కూడా తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే శ్రీ లీల ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణలాంటి వాళ్లతో సినిమాలు చేస్తోంది. దాదాపు 12 సినిమాలకు సంతకాలు చేయగా.. అందులో కొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా అలానే చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. భగవంత్ కేసరి, స్కంద, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్‌సింగ్, ఆదికేశవ, అనగనగా ఒక రాజు, జూనియర్ మూవీలతోపాటు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, విజయ్ దేవరకొండ 12 లో నటించనుంది.