
Kalyani Malik: రాజమౌళి ఫ్యామిలీలో అందరూ ఆర్టిస్టులే. రైటర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడక్షన్, నటులు, సింగర్స్… ఇలా సినిమాకు కావాల్సిన అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. రాజమౌళి సినిమాలకు పనిచేసే టీంలో సగం మంది కుటుంబ సభ్యులే ఉంటారు. ఇక అన్నయ్య కీరవాణిని ఆస్థాన సంగీత దర్శకుడిగా చేసుకున్నాడు. ఆయన గోల్డెన్ గ్లోబ్ అందుకునేలా వెనుకుండి నడిపించాడు.కీరవాణి కలలో కూడా ఊహించని గౌరవం అందించారు. రాజమౌళి ఫ్యామిలీలో అందరూ ఫేమ్ తెచ్చుకున్నారు. ఒకరిద్దరు మాత్రం మరుగున పడిపోయారు.
వారిలో కళ్యాణి మాలిక్ ఒకరు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన కళ్యాణ్ మాలిక్ ఎం ఎం కీరవాణికి స్వయానా తమ్ముడు. రాజమౌళికి కజిన్ అవుతాడు. కళ్యాణి మాలిక్ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. టాలెంట్ ఉండి కూడా వెలుగులోకి రాలేకపోయాడు. అమృతం సీరియల్ కి మొదటిసారి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘ఐతే’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
ఆయన మ్యూజిక్ అందించిన అష్టా చెమ్మా, ఆంధ్రుడు, అలా మొదలైంది, ఊహలు గుసగుసలాడే మంచి విజయాలు సాధించాయి. పాటలు సైతం ప్రాచుర్యం పొందాయి. అయితే కళ్యాణి మాలిక్ కి ఫేమ్ రాలేదు. ఆయనకు ఆఫర్స్ కూడా అడపాదడపా వస్తాయి. మేకర్స్ ఆయన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండు దశాబ్దాల కెరీర్లో కళ్యాణ్ మాలిక్ చేసింది తక్కువ చిత్రాలే. ఆయనకు ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ క్రమంలో తన అసహనం భయపెట్టాడు.

ఇటీవల నేషనల్ అవార్డ్స్ ఎలా వస్తాయో నా మిత్రుడు వివరించారు. అప్పటి నుండి నాకు అవార్డుల మీద ఆశ, గౌరవం పోయింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలోని ‘కనులు చాటు మేఘమా’ సాంగ్ కి మంచి పేరొచ్చింది నేషనల్ అవార్డు వస్తుందని ఆశించినట్లు ఆయన వెల్లడించారు. ఊహలు గుసగుసలాడే మూవీలోని ‘ఏం సందేహం లేదు’ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పాటను నేను, సింగర్ సునీత కలిసి పాడాం. సునీతకు అవార్డు ఇచ్చి నాకు ఇవ్వలేదు. ఆమెకు మాత్రమే అవార్డు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అందుకే అవార్డుల గురించి ఆలోచించడం మానేశాను. ఎవరైనా నిర్మాత ఫోన్ చేసి ఒక సినిమా ఆఫర్ ఇస్తే… అదే గొప్ప అవార్డుగా భావిస్తానని ఆయన అసహనం బయటపెట్టారు.
