
MLC Kavitha: కల్వకుంట్ల వారసురాలు.. బీజేపీ నేతలు లిక్కర్ క్వీన్ అని పిలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు గారాల పట్టి.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతోంది. గతంలో ఏ నేత కూడా ఇంతలా ట్రోల్ కాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీకి వెళ్లడాన్ని ఇంతలా ట్రోల్ చేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈడీ నోటీసులు.. ఢిల్లీ ప్రయాణం..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు మూడునెలలుగా ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఇక కవితే అని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఈనెల 10న ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా కవితకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు ఢిల్లీ రావాలని సూచింది. అయితే అప్పటికే ఆమె దీక్ష కోసం 8న సాయంత్రం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాకతాళీయమో, కావాలని చేశారో తెలియదు కానీ ఇంతలో ఈడీ నోటీసులు వచ్చాయి. దీంతో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లిన కవిత వీడియో న్యూస్ చానెళ్లలో ప్రచారమైంది.
ఆ వీడియోనే నెట్టింట వైరల్..
కవిత ఎయిర్ పోర్టుకు వెళ్తున్న వీడియో బయటకు వచ్చిన మరు క్షణమే నెట్టింటో చక్కర్లు కొడుతోంది. కవిత ఒంటరిగా ఎయిర్ పోర్టులోకి వెళ్తున్న వీడియోకు తమకు నచ్చిన పాటను జోడించి వైరల్ చేస్తున్నారు. ‘చిలకా.. ఏ తోడు లేక ఎటైపమ్మ ఒంటిరి నడకా..’ అని ఒకరు.. ‘ఏ మున్నదక్కో.. ఏమున్న దక్కా…’ అనే పాటతో మరి కొందరు..
‘‘వక్క వక్క ఉయ్యాలో..
ఎటూ పోతున్నవ్ వక్క ఉయ్యాలో..
ఢిల్లీ వాళ్లు పిలిచిరి ఉయ్యాలో..
ఢిల్లీ పోతున్నా ఉయ్యాలో..
ఢిల్లీ కి ఎందుకు పిలిచిర్రు ఉయ్యాలో ..
నిన్ను ఎట్లా పీలిచిర్రు ఉయ్యాలో..
లిక్కర్ స్కాంలో ఇరికిన ఉయ్యాలో..
వాళ్లు పిలిచిల్లు ఉయ్యాలో..
పోయిరా వక్క ఉయ్యాలో..
మళ్లీ రాకు వక్క ఉయ్యాలో… అంటూ ఇంకొందరు.
హ్యాపీ జర్నీ అక్క అని అనేక మంది కవితను ట్రోల్ చేయడం చర్చనీయాంశమైంది.

అరెస్ట్ కోసం వేయిట్ చేస్తున్నారా?
కవితను ట్రోల్ చేస్తున్నవారిలో విపక్ష బీజేపీ నేతలతోపాటు సమాన్యులు కూడా ఉండడం గమనార్హం. నిరుద్యోగులు, పేద, సమాన్యులు, యువకులు, స్టూడెంట్స్, మహిళలు, యువతులు కూడా ఉన్నారు. తాజాగా కవితను ఇంతలా ట్రోల్ చేయడం చూస్తుంటే తెలంగాణలో మెజారిటీ ప్రజలు కవితను అరెస్ట్ చేయాలనే భావిస్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవితకు నోటీసులను బీఆర్‌ఎస్ నేతలు మినహా ఎవరూ ఖండించడంలేదు. కనీసం మహిళ అనే సానుభూతి కూడా కవితపై కనిపించడం లేదు. మొత్తంగా సోషల్ మీడియా చరిత్రలో ఏ నేతను ట్రోల్ చేయని విధంగా కవితను నెటిజన్లు ట్రోల్ చేయడం ఆసక్తిగా మారింది.
