
Rajamouli: పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిటా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి ప్రిన్స్ మహేశ్‌బాబుతో తీసే సినిమానే చివరి సినిమానా? అదేంటి అంతపెద్ద మాట అనేశారు అనుకుంటున్నారా.. రాజమౌళి డైరెక్షన్‌కు స్వస్తి చెప్పబోతున్నారా? లేక తెలుగు సినిమాలు తీయొద్దని నిర్ణయించుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే ఈ ప్రశ్నలకు రాజమౌళే అవుననే సమాధానం చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన రాజమౌళి మనసంతా ఇప్పుడు హాలీవుడ్‌పై ఉంది. ఇటీవల హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, స్టీవ్ స్పీల్ బర్గ్ ఇటీవల రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. స్పీల్‌బర్ట్ అయితే హాలీవుడ్‌కు రావాలని సూచించారు. దీంతో రాజమౌళి ఇక హాలీవుడ్‌కు వెళ్లిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికే మహేశ్‌బుబుతో సినిమాకు కమిట్ అయినందున ఈ సినిమా తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేయడం ఖాయం.
Also Read: Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్… ఇది మరో సాహసం!
ఆస్కార్ బరిలో ట్రిపుల్‌ఆర్..
రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డు బరిలో ఉంది. ఈనెల 12న ఆస్కార్ అవార్డులు ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉంటే ట్రిపులార్‌లోని నాటునాటు పాటకు ప్రముఖ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. దీంతో హాలీవుడ్ ప్రముఖుల దృష్టంతా ట్రిపుల్ ఆర్ సినిమాపై పడింది. ఇప్పటికు చాలామంది దర్శకులు సినిమా చూశారు. రాజమౌళితోపాటు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మారిపోతున్న మహేశ్‌బాబు..
మరోవైపు రాజమౌళి సినిమా కోసం ప్రిన్స్ మహేశ్‌బాబు. రాజమౌళితో సినిమా అంటూ మాములు విషయం కాదని ఇప్పటికే జూనియన్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు ప్రభాస్, ఆణా కూడా చెప్పారు. తాజాగా ఈ విషయం మహేశ్‌బాబుకు కూడా అర్థమైంది. దీంతో రాజమౌళికి కావాల్సిన రీతిలో మహేశ్‌బాబు తన శరీరాకృతిని మార్చేసుకుంటున్నారు. మహేశ్‌బాబు కూడా రాజమౌళితో ఒక్క సినిమా తీస్తే 25 సినిమాలు తీసినట్లు లెక్క అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర శారీక శ్రమతో కూడుకున్నదని ప్రకటించారు. అందుకోసం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. బాహుబలి కోసం ప్రభాస్, రాణా తమ ఐదేళ్ల కాలాన్ని రాజమౌళికి ఇచ్చేశారు. ఇప్పుడు మహేశ్‌బాబు కూడా తనను పూర్తిగా మార్చేసుకుంటున్నారు రాజమౌళి కోసం. ఏమాత్రం తేడా వచ్చినా రాజమౌళి ఒప్పుకోరు మరి.
హాలీవుడ్‌పై దృష్టి..
ఇదిలా ఉంటే మహేశ్‌బాబు సినిమా వర్క్‌లో ఉంటూనే రాజమౌళి హాలీవుడ్‌వైపు అడుగులు వేస్తున్నారు. ఈమేరకు కొంతమందితో సంప్రదింపులు కూడా జరుపతుతున్నట్లు సమాచారం. స్టోరీ రైటింగ్, స్క్రీన్‌ప్లే తదితర విషయాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మన రాజమౌళిని బాలీవుడ్ దర్శకుడిగా రెండేళ్లలో చూడడం ఖాయమని టాలీవుడ్ టాక్.
Also Read: Rashmika Mandanna: ట్రోల్ ఆఫ్ ది డే : బట్టల్లేక, సరిపోక.. పాపం రష్మిక పరువు అంతా పాయే!