Telugu Producers Theatre List : గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న థియేటర్స్ పంచాయితీ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. సింగల్ స్క్రీన్ థియేటర్స్ మొత్తం ఇక మీదట రెంటల్ బేసిస్ మీద కాకుండా కమీషన్ బేసిస్ మీద నడపాలని, లేకపోతే థియేటర్స్ మనుగడ భవిష్యత్తులో కష్టమేనని, దీనిపై తక్షణమే ఎదో ఒక నిర్ణయానికి రావాలంటూ నిర్మాతలు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఇటీవల రహస్యంగా చర్చలు జరపడం, సరిగ్గా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతున్నప్పుడే ఈ సమస్య ని ఎత్తి చూపడం, ఆ కారణం చేత పవన్ కళ్యాణ్ కి కోపం రావడంతో జరిగిన పరిణామాలన్నీ మనమంతా చూసాము, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం మొత్తానికి సూత్రదారులు ‘ఆ నలుగురు’ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ నలుగురిలో మేము లేమంటూ ‘దిల్ రాజు'(Dil Raju), అల్లు అరవింద్(Allu Aravind) ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు.
మరి అందరూ చెప్తున్న ఆ నలుగురు ఎవరు?, రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం ఏ నిర్మాతల ఆధీనం లో ఉంది అనేది ఇప్పుడు స్పష్టంగా మనం చూడబోతున్నాము. PVR సంస్థకు దాదాపుగా 109 థియేటర్స్ ఉన్నాయట. అదే విధంగా ఏషియన్ సంస్థ వారికి 71 థియేటర్స్, మైత్రీ మూవీ మేకర్స్ కి 40 థియేటర్స్, దిల్ రాజు కి 29 థియేటర్స్, సురేష్ ప్రొడక్షన్స్ కి 60 కి పైగా థియేటర్స్, ఆంధ్ర లో దిల్ రాజు కి 31 థియేటర్స్ ఉన్నాయి. మొత్తం మీద దిల్ రాజు కి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 60 థియేటర్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈమధ్య కాలం లో పాత థియేటర్స్ ని తీసుకొని రీ మోడలింగ్ చేసి నడుపుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ వీళ్ళ థియేటర్స్ ఇప్పుడు కొలువుదీరుతున్నాయి.
ఏషియన్ సంస్థ వారికి ఇంకా ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కానీ, తక్కువ రిపోర్ట్ అయ్యాయని చెప్తున్నారు. అదే విధంగా యూవీ క్రియేషన్స్ సంస్థ కి 32 థియేటర్స్, గీత ఆర్ట్స్ సంస్థకు 20 థియేటర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పినట్టు గానే ఆ నలుగురి చేతిలోనే థియేటర్స్ ఉన్నాయి అనడం లో ఎలాంటి నిజం లేదని అర్థం అవుతుంది. దాదాపుగా అందరి నిర్మాతలకు థియేటర్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం థియేటర్స్ దిల్ రాజు, ఏషియన్ సునీల్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ చేతుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏషియన్ సంస్థ హైదరాబాద్ లో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ లతో కలిసి కొన్ని ప్రత్యేకమైన మాల్స్ ని కట్టించారు. వాటికి మంచి గిరాకీ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఏషియన్ సంస్థ నే ప్రస్తుతం అగ్ర స్థానం లో ఉన్నట్లు తెలుస్తుంది.