Palasa: స్కూలుకెళుతున్నానని చెప్పి.. చావు అంచుదాకా వెళ్లిన బాలుడు.. అసలేమైందంటే?

పలాస కు చెందిన ఓ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. బడికి వెళ్తున్నానని చెప్పి.. పలాస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాడు.

Written By: Dharma, Updated On : October 15, 2023 1:30 pm

Palasa

Follow us on

Palasa: కొందరు చావు అంచు వరకు వెళ్లి బయటపడుతుంటారు. ఇటువంటి వారిని మృత్యుంజయులుగా చెబుతుంటారు. అనారోగ్యానికి గురై దాదాపు మృత్యువు అంచులకు వెళ్లి బయటపడిన వారు ఉంటారు. మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసుకుని.. సకాలంలో వైద్యం పొంది చావు నుంచి బయటపడతారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ బాలుడు ఇలానే ప్రాణాలతో బయటపడ్డాడు ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

పలాస కు చెందిన ఓ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. బడికి వెళ్తున్నానని చెప్పి.. పలాస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. ప్లాట్ ఫారం నుంచి కిందకు దిగి రైలు వచ్చే ముందు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడుకున్నాడు. వెంటనే రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ షరీఫ్, సిబ్బంది సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడారు. అయితే రైల్వే పోలీసులను చూసిన బాలుడు మరింత ఆందోళనకు గురయ్యాడు. మరి ఇప్పుడు ఇలాంటి తప్పు చేయనని రోధిస్తూ ఎస్సై కాలు పట్టుకొని ప్రాధేయపడ్డాడు.

ఆందోళనతో ఉన్న బాలుడిని రైల్వే పోలీసులు అక్కున చేర్చుకున్నారు. నీకేం చేయమంటూ భరోసా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకునే అంత బాధ నీకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించారని బాలుడు చెప్పడంతో రైల్వే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను రప్పించి వారికి అన్ని విషయాలు పై అవగాహన కల్పించారు. అనంతరం ఆ బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఎస్సై షరీఫ్, హెచ్ సి కోదండరావ్, నాగరాజు, సంతోష్ కుమార్, దేవేంద్రులను బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.