https://oktelugu.com/

Puneeth Rajkumar: పునీత్ హీరోగా నిలదొక్కుకోవడానికి తెలుగు సినిమాలే కారణం.. అవేంటో తెలుసా..?

Puneet Rajkumar telugu remake movies: కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఆయన మరణం సౌత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ తో ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులతో సత్సంబంధాలు మంచిగా ఉండేవి. అందుకే ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇతర నటులు తరలివెళ్లారు. అంతేకాకుండా అశేష అభిమానులు ఇంకా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2022 / 11:00 AM IST
    Follow us on

    Puneet Rajkumar telugu remake movies: కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఆయన మరణం సౌత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ తో ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులతో సత్సంబంధాలు మంచిగా ఉండేవి. అందుకే ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇతర నటులు తరలివెళ్లారు. అంతేకాకుండా అశేష అభిమానులు ఇంకా ఆయన సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పిస్తూనే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ ప్రేక్షకుల మధ్య లేకున్నా ఆయన గుర్తులు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తీసిన సినిమాలను ఇప్పటికీ కొందరు మళ్లీమళ్లీ చూస్తున్నారు.

    puneeth rajkumar

    పునీత్ కు తెలుగు ఇండస్ట్రీతో విపరీతమైన సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలను కన్నడంలో రీమేక్ చేసిన వారిలో పునీత్ రాజ్ కుమార్  ముందున్నారు. తెలుగు సినిమాలను కన్నడంలో పునీత్ ఎక్కువగా తీశారు. తెలుగులో వచ్చిన ‘ఇడియట్’ సినిమాను కన్నడంలో ‘అప్పు’ పేరుతో ముందుగా తీశారు. అప్పటి నుంచి పునీత్ ను ‘అప్పు’గా పిలుస్తున్నారు. ఈ సినిమా కన్నడంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దానిని పూరి జగన్నాథ్ ‘ఇడియట్ ’ పేరుతో రీమేక్ చేశారు. అయితే కన్నడంలో విడుదలయిన ‘అప్పు’ను ‘ఇడియట్’గా తీసిన తరువాత తెలుగులో వచ్చిన కొన్ని హిట్ సినిమాలను తీసుకొని పునీత్ కన్నడంలో రీమేక్ చేశారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

    తెలుగులో రవితేజ-పూరిజగన్నాథ్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో విజయం సాధించినవి కూడా ఉన్నాయి. వాటిలో ‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’ కూడా ఒకటి ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ గా బ్లాక్ బస్టర్ సాధించింది. అప్పటికే ‘ఇడియట్’ సినిమాతో మంచి ఊపు మీదున్న రవితేజకు ఈ సినిమా మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈ సినిమాను కన్నడంలో ‘మౌర్య’ పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమా కన్నడంలోనూ మంచి విజయం సాధించింది. దీంతో పునీత్ కు ఈ సినిమా నుంచే స్టార్ ఇమేజ్ పెరిగింది.

    రామ్ హీరోగా వచ్చిన ‘రెడీ’ మూవీ అతని కెరీన్ ను ములుపు తిప్పింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కన్నడంలో ‘రామ్ పేరీట రీమేక్ చేశారు. దీంతో ఈ సినిమా అక్కడ కూడా విజయం సాధించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీని కన్నడంలో ‘అజయ్’ పేరుతో తీశారు. ఈ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. మహేశ్ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ తెలుగులో మంచి సక్సెస్ సాధించిది. దీనిని కన్నడంలో ‘పవర్’పేరుతో రీమేక్ చేయగా పునీత్ రాజ్ కుమార్ మంచి పర్ఫామెన్స్ చూపించారు.

    ఇక తెలుగులో డిజాస్టర్ మిగిల్చిన సినిమాలను పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో తీసి బ్లాక్ బస్టర్ చేశారు. తెలుగులో పూరి జగన్నాథ్ -జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ తెలుగులో డిజాస్టర్ గా మిగిల్చింది. దీంతో ఈ సినిమాను కన్నడంలో ‘వీర కన్నడియన్’ పేరుతో తీయగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇలా వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ కు తెలుగు సినిమా పరిశ్రమతో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అందుకే చందన సీమతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఆయన మృతిని తట్టుకోలేకపోయింది.

    Also Read: స్థాయిలో చిన్న నటులైనా నటనలో పెద్ద నటులు !