https://oktelugu.com/

KTR Tweets On Gujarat Power Cut: గుజార‌త్‌లో ప‌వ‌ర్ క‌ట్‌.. ఆటాడేసుకుంటున్న కేటీఆర్‌.. టైమింగ్ అంటే ఇదేనేమో..

KTR Tweets On Gujarat Power Cut: రాజ‌కీయాల్లో ప్ర‌తిపక్ష పార్టీల విష‌యంలో ఏ కొంచెం మిస్టేక్ దొరికినా.. దాన్ని విప‌రీతంగా విమ‌ర్శించేసి.. ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటు. ఈ అల‌వాటు మ‌న‌కు ఎక్కువ‌గా బీజేపీలో క‌నిపిస్తుంది. అయితే మేమేం త‌క్కువా అన్న‌ట్టు ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఇదే పంథాను ఎంచుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ మాత్రం మిస్టేక్ క‌నిపించినా స‌రే దాన్ని వేలెత్తి చూపించేస్తున్నారు. ఇప్పుడు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 31, 2022 / 10:29 AM IST

    KTR

    Follow us on

    KTR Tweets On Gujarat Power Cut: రాజ‌కీయాల్లో ప్ర‌తిపక్ష పార్టీల విష‌యంలో ఏ కొంచెం మిస్టేక్ దొరికినా.. దాన్ని విప‌రీతంగా విమ‌ర్శించేసి.. ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటు. ఈ అల‌వాటు మ‌న‌కు ఎక్కువ‌గా బీజేపీలో క‌నిపిస్తుంది. అయితే మేమేం త‌క్కువా అన్న‌ట్టు ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఇదే పంథాను ఎంచుకుంటున్నారు.

    KTR

    బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ మాత్రం మిస్టేక్ క‌నిపించినా స‌రే దాన్ని వేలెత్తి చూపించేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఇదే ప‌ని చేశారు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ లో క‌రెంట్ క‌ష్టాలు ఎక్కువ‌య్యాయి. దీంతో అక్క‌డున్న బీజేపీ ప్ర‌భుత్వంకీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి ప్ర‌తి వారంలో ఒక రోజు ప‌వ‌ర్ హాలిడే అంటూ తెలిపింది.

    Also Read: Bank Holidays: అలెర్ట్‌.. బ్యాంకుల‌కు రేప‌టి నుంచి వ‌రుస సెల‌వులు.. ఈ ఒక్క‌రోజే ఛాన్స్‌..

    ఇంకేముంది దొరికిందే సందు అన్న‌ట్టు దానిపై కేటీఆర్ త‌న‌దైన స్టైల్ లో ట్వీట్ చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ ప‌వ‌ర్ హాలిడేకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను పోస్టు చేస్తూ సెటైర్లు పేల్చారు. దేశంలోనే అత్యంత శ‌క్తి వంత‌మైన వ్య‌క్తుల‌కే కేరాఫ్ అడ్ర‌స్ అయిన గుజ‌రాత్ లో ప‌వ‌ర్ హాలిడే ఏంటంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    అస‌లు గుజ‌రాత్ లో ఉన్న‌ది డ‌బుల్ ఇంజినా లేక ట్ర‌బుల్ ఇంజినా అంటూ దారుణ‌మైన సెటైర్ వేసేశారు. ఇక్క‌డ ఆయ‌న ఈ డబుల్ ఇంజిన్, ట్ర‌బుల్ ఇంజిన్ అనే మాట‌లు ఎందుకు అన్నారంటే.. మొన్న కేసీఆర్ కూడా బీజేపీ ప్ర‌భుత్వం మీద ఇలాగే డ‌బుల్ ఇంజినా లేక ట్ర‌బుల్ ఇంజినా అంటూ విరుచుకుప‌డ్డారు.

    KTR Tweets On Gujarat Power Cut

    ఇప్పుడు కేటీఆర్ కూడా ఆ డైలాగ్‌ను ఈ సంద‌ర్భంగా వాడేశార‌న్న‌మాట‌. ఎంతైనా కేటీఆర్ కూడా మాట‌కారే క‌దా. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అలాంటి క‌రెంట్ స‌మ‌స్య‌లు లేవ‌ని, మోడీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లోనే ప‌వ‌ర్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఇన్ డైరెక్టుగా చెప్పార‌న్న‌మాట‌. అంటే సొంత రాష్ట్రానికే ఏం చేయ‌ని మోడీ.. ఇక దేశానికి ఏం చేస్తార‌న్న‌ది కేటీఆర్ సెటైర్ అన్న‌మాట‌.

    ఇక దేశంలో పెట్రోల్ మంటపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోడీని ట్యాగ్ చేసి మరీ ఎండగట్టారు. మోడీ చేసిన పాత ట్వీట్లను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నరేంద్రమోడీ పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడల్లా చేసిన ట్వీట్లను బయటకు తీసి మరి ఎండగట్టారు.దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత 10రోజుల్లో 9సార్లు పెంచారని.. ఇదేనా ‘అచ్చే దిన్’ అంటూ నరేంద్రమోడీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

    Also Read: Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?

    Tags