
Summer Holidays 2023: తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. దీంతో ఈ మేరకు అన్ని పాఠశాలలు మూసి వేయాలని సూచించింది. సెలవుల తరువాత 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12న తిరిగి ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-II పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షలు ఎప్పుడంటే..
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో 21 నుంచి 24 వరకు మూల్యాంకనం ఉంటుంది. ఏప్రిల్ 25న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
వేసవి సెలవుల్లో..
సెలవు రోజుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బాయిలైతే ఈత కొట్టడానికి వెళ్లి చెరువుల్లో, బావుల్లో మృత్యువా పడుతుంటారు. ఎవరైనా పెద్దవారు తోడుంటేనే వారిని ఈతకు వెళ్లనివ్వాలి. అంతేకాని అందరు చిన్న పిల్లలు వెళితే ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి. తరువాత బాధ పడితే లాభం ఉండదు. ఎందుకంటే వారు సరదా కోసం వెళతారు. అదే వారి పాలిట శాపంగా మారుతుంది. ఈత రాకపోవడం వల్ల నీళ్లలో మునిగి చాలా మంచి చనిపోతుంటారు.

ఏదైనా నేర్పించడం
కొత్తగా ఏదైనా వారికి నేర్పించాలి. కంప్యూటర్ నేర్చుకోవడానికి పంపించడం ఇంకా మంచిది. ఏదో ఒక వ్యాపకం ఉంటే ఇతర వాటిపై దృష్టి పడకుండా ఉంటుంది. దీని వల్ల కూడా వారిని ప్రమాదాల నుంచి కాపాడవచ్చు. కానీ ఎటు పడితే అటు తిరగడం వల్ల ఇబ్బందులొస్తాయి. ఈ విషయం గమనించుకుని తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాపాడుకోవాలి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూస్తే సరిపోతుంది. స్నేహితులతో కలిసి తిరిగితే ఎటు వెళతారో కూడా తెలియదు. సో పేరెంట్స్ జాగ్రత్త సుమా.