Ajith Vs Vijay: వారసుడు వర్సెస్ తెగింపు…. ఏ సినిమా బెస్ట్? సోషల్ మీడియా టాక్ ఇదే!

Ajith Vs Vijay: రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్ లో అతి పెద్ద స్టార్స్ గా అవతరించారు విజయ్, అజిత్. ఈ ఇద్దరు హీరోల నడుమ ప్రధాన పోటీ నెలకొంటుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయ్యారు. విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తమిళనాడులో ఈ హీరోల ఫ్యాన్ వార్స్ ఎంత వరకు వెళ్లాయంటే హత్యలు కూడా చేసుకున్నారు. ఒక హీరోని తమిళులు అభిమానించినంతగా మరొకరు అభిమానించరు. ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోజు ఆ ఇద్దరు […]

Written By: Shiva, Updated On : January 11, 2023 8:45 am
Follow us on

Ajith Vs Vijay: రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్ లో అతి పెద్ద స్టార్స్ గా అవతరించారు విజయ్, అజిత్. ఈ ఇద్దరు హీరోల నడుమ ప్రధాన పోటీ నెలకొంటుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయ్యారు. విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తమిళనాడులో ఈ హీరోల ఫ్యాన్ వార్స్ ఎంత వరకు వెళ్లాయంటే హత్యలు కూడా చేసుకున్నారు. ఒక హీరోని తమిళులు అభిమానించినంతగా మరొకరు అభిమానించరు. ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోజు ఆ ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Ajith Vs Vijay

ఆల్రెడీ సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఇక నిన్నటి నుండి థియేటర్స్ వద్ద అజిత్-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడటం, కొట్టుకోవడం చేస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల టాక్ యావరేజ్ గా ఉండటం విశేషం. యూఎస్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో తునివు, వారిసు చిత్రాలపై క్రిటిక్స్, ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అజిత్ వరుసగా దర్శకుడు హెచ్ వినోత్ తో చిత్రాలు చేస్తున్నారు. ఆయన గత రెండు చిత్రాలు నెర్కొండ పార్వై, వలిమై ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. తాజాగా తునివు చిత్రం కోసం మరోసారి జతకట్టారు.

తెలుగులో తునివు తెగింపు టైటిల్ తో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో జనవరి 11న విడుదల చేశారు. మెజారిటీ వర్గాల అభిప్రాయం ప్రకారం అజిత్ మేనరిజమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. స్టోరీ లైన్ కూడా బాగుంది. సినిమాకు మంచి ఆరంభం ఇచ్చిన దర్శకుడు దాన్ని కొనసాగించడంలో విఫలం చెందాడు. టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉంది. తునివు మూవీలో అదిరిపోయే ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, ఓవరాల్ గా యావరేజ్ మూవీ అంటున్నారు.

Ajith Vs Vijay

ఇక వారిసు సైతం ఇదే తరహా టాక్ అందుకుంటుంది. నేడు తమిళ్ వర్షన్ మాత్రమే విడుదలైంది. జనవరి 14న వారసుడు విడుదల చేయనున్నారు. వారిసు మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. సీరియల్ ని తలపించే సన్నివేశాలతో దర్శకుడు వంశీ పైడిపల్లి మెల్లగా నడిపించారు. అక్కడక్కడా ఆకట్టుకునే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ అంశాలు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన వారిసు మూవీలో ఫ్యామిలీ డ్రామా ఎక్కువైపోగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. విజయ్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పించే అంశాలట. ఏది ఏమైనా పూర్తి రివ్యూ వస్తే కానీ తునివు, వారిసు చిత్రాల్లో ఏది బెటర్ అనేది చెప్పగలం.