Mithali Raj: సినిమాల్లో హీరోయిన్లు తమ గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని గ్లామర్ సీన్లు సినిమా సక్సెస్‌కు దోహదపడతాయి. ఇక కొంతమంది హీరోయిన్లు.. తవకాశాలు తగ్గిపోతున్న వేళ.. గ్లామర్ డోస్ పెంచుతారు. కానీ ఈ మధ్య గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండేవారు సైతం గ్లామర్ తలుపులు తెరుస్తున్నారు. అటు ఫ్యాన్స్‌ను.. సెలబ్రిటీలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. హీరోయిన్లనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇందుకు స్టార్ క్రికెటర్ మిథాలిరాజ్ ఉదాహరణ. గతంలోనూ మిథాలి కొన్ని గ్లామర్ ఫొటోలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా గ్లామర్ డోస్ పెంచి మరిన్ని ఫొటోలు ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

రిటైర్మెంట్ తర్వాత..
మిథాలిరాజ్ ఇటీవలే క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. గతంలో ఇండియా టీంలో ఉండగానే అప్పుడప్పుడూ ఫొటోలను అభిమానులకు, ఫాలోవర్స్‌కు షేర్‌చేసింది. రిటైర్మెంట్ తర్వాత గ్లామర్ డోస్ పెంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘శభాష్ మిథు’ మూవీ ప్రమోషన్‌లో మిథాలీ రాజ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.
Also Read: The Warrior Review: ‘ది వారియర్’ మూవీ రివ్యూ
23 ఏళ్ల క్రికెట్ కెరీయర్..
టీమిండియా మాజీ కెప్టెన్ అయిన మిథాలీ రాజ్.. ఇటీవలే క్రికెట్‌కు ముగింపు పలికింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీయర్ కొనసాగించి అత్యధిక కాలం క్రికెట ఆడిన ఉమెన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అయితే వరల్డ్ కప్ గెలవాలన్న తన కల మాత్రం నెరవేరలేదు. వయసు పెరుగుతుండడం, ఫిట్‌నెస్ సమస్య, ఆటలో పదును తగ్గడంతో సుదీర్ఘ కెరీయర్‌కు ఇటీవలే ముగింపు పలికింది. ప్రస్తుతం ఈ హైదరాబాది స్టార్ తన బయోపిక్ ‘శభాష్ మిథు’ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. మిథాలీ రాజ్ లైఫ్ స్టోరీ, కెరీర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ బయోపిక్ రూపొందించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ తాప్సి.. మిథాలీ రాజ్ రోల్ పోషించగా.. ఈ సినిమా జూలై 15న దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
స్టైలిష్ డ్రెస్.. హాట్ ఫొటోస్
సినిమా ప్రమోషన్స్ కోసం స్టయిలిష్, ట్రెండీ వేర్ ధరిస్తోంది మిథాలీ రాజ్. తాజాగా జరిగిన ప్రమోషన్స్‌లో స్లీవ్ లెస్ టాప్ ధరించి.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపింది. అయితే.. మిథాలీ రాజ్ గ్లామరస్‌గా కనిపించడం కొత్త కాదు. బాలీవుడ్ హీరోయిన్లను తలపించే మిథు.. గతంలో ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోలన్నీ సోషల్ మీడియాను షేక్ చేశాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా..
మిథాలి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. 1999లో టీమిండియా ఉమెన్స్ టీంలో చేరిన మిథాలీ.. భారత మహిళ క్రికెట్‌కు ఆదరణ పెరగడంలో కీలకంగా వ్యవహరించింది. కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడి.. టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి రికార్డుకెక్కింది. అయితే ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరకుండానే మిథాలీ రాజ్ కెరియర్‌కి ఫుల్ స్టాప్ పెట్టడం బాధాకరం. ప్రస్తుతం మిథాలీ వయసు 39 సంవత్సరాలు. త్వరలో పెళ్లి వార్త కూడా చెప్పబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిథాలీ గ్లామర్ ఫోటోలకు ఫోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read:PV Sindhu: పీవీ సింధులో ఆ టాలెంట్ కూడా.. డ్యాన్స్‌తో అదరగొడుతున్న బాడ్మింటన్ స్టార్
[…] […]