NTR -Team India Cricketers: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని టీమ్ ఇండియా క్రికెటర్స్ కలిశారు. ఆయనతో ఫోటోకి ఫోజిచ్చారు. న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన క్రికెటర్స్ ఎన్టీఆర్ తో ముచ్చటించారు.కాగా ఎన్టీఆర్ ఇండియాకు వచ్చి కొద్దిరోజులే అవుతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అమెరికా వెళ్లారు. అనంతరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. రాజమౌళి, రామ్ చరణ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతిని వెంట తీసుకెళ్లారు. ఆమె సైతం ఈవెంట్లో పాల్గొన్నారు.ఇక ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. గోల్డ్ గ్లోబ్ ఈవెంట్ ఘనంగా ముగించుకొని ఎన్టీఆర్ ఇండియాకు వచ్చారు. దీంతో ఇండియన్ క్రికెటర్స్ కి ఆయన్ని కలిసే అవకాశం దక్కింది. యంగ్ క్రికెటర్స్ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, చాహల్, శార్దూల్ ఠాకూర్ తో పాటు మరికొందరు ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యులు ఎన్టీఆర్ తో ముచ్చటించారు.
న్యూజిలాండ్ టీమ్ ఇండియా టూర్ లో భాగంగా ఆరు వన్డే మ్యాచ్లు ఆడనుంది. మొదటి మ్యాచ్ కి హైదరాబాద్ వేదికైంది. జనవరి 18న మ్యాచ్ జరగనుండగా టీం ఇండియా సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. సందర్భం కుదరడంతో ఎన్టీఆర్ ని వారు కలిశారు. ఫోటోలు దిగి ముచ్చటించారు. యంగ్ క్రికెటర్స్ తో ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సదరు ఫోటోలు చూసి… మా అన్న క్రేజ్ అంటే అది మరీ… అని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూట్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 30 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే మూవీ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.
With Some Of The Indian Cricket Team Players…@tarak9999 – @yuzi_chahal – @surya_14kumar – @ShubmanGill – @ishankishan51 – @imShard ….#NTRGoesGlobal pic.twitter.com/f1FmJx1wyy
— WORLD NTR FANS (@worldNTRfans) January 17, 2023