
Bhuma Maunika: మంచు మనోజ్ నిర్ణయం కుటుంబంలో కుంపటి రాజేసింది అంటున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు ఆయనపై కోపంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. 2019లో భార్యతో విడిపోయిన మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. మార్చి 3న ఆయన భూమా మౌనిక మెడలో తాళికట్టాడు. అక్కయ్య మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ వివాహం జరిగింది. మౌనికతో వివాహం ఇష్టం లేని మోహన్ బాబు, మంచు విష్ణు అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏదో చుట్టపు చూపుగా వచ్చి తంతు పూర్తి చేశారు. విష్ణు అయితే అసలు కెమెరాలకు కూడా దొరకలేదు.
భూమా మౌనికతో వివాహమైన వెంటనే మనోజ్ సంచలన ప్రకటన చేశారు. మౌనిక మొదటి భర్త కుమారుడైన ధైరవ్ రెడ్డి బాధ్యత తనదే అన్నారు. ధైరవ్ తమ వద్దే పెరుగుతాడని స్పష్టత ఇచ్చాడు. మొదటి భర్తతో విడాకులైనప్పటి నుండి కొడుకు మౌనిక దగ్గరే పెరుగుతున్నాడు. కాబట్టి పెళ్లయ్యాక కూడా ధైరవ్ తమ వద్దే ఉండేలా మౌనిక మనోజ్ వద్ద మాట తీసుకుని ఉండొచ్చు. ఆమె చెప్పినందుకో ఈయన ఇష్టపడో ధైరవ్ ని మనోజ్ కొడుకుగా అంగీకరించారు.

మనోజ్ కి మొదటి భార్యతో పిల్లలు లేరు. కాబట్టి ప్రస్తుతానికి మనోజ్ ఆస్తికి ధైరవ్ వారసుడు అయ్యాడు. మౌనిక-మనోజ్ పిల్లలు కనే వరకు ధైరవ్ నే వారసుడు అన్నట్లు. ఈ పరిమాణం మంచు ఫ్యామిలీలో మరింత మంట రాజేసిందట. మంచు కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని మౌనిక కుమారుడు ఆస్తికి వారసుడు ఎలా అవుతాడని… వారు మండి పడుతున్నారట. ఈ క్రమంలో పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యంటున్నారు.
టాలీవుడ్ లో ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య విద్యాదేవి పిల్లలు లక్ష్మి, విష్ణు. విద్యాదేవి మరణించడంతో ఆమె చెల్లెలు నిర్మలా దేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెకు మనోజ్ సంతానం. ఇక విష్ణుకు ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు సంతానం. కాగా మంచు లక్ష్మి సరోగసి పద్దతిలో ఒక అమ్మాయిని కన్నారు. వీరే మోహన్ బాబు ఆస్తికి వారసులుగా ఉన్నారు.

