Suryakumar Yadav: అహ్మదాబాద్ లో న్యూజిలాండ్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది..2_1 తేడాతో దక్కించుకుంది.. దీంతో టీం ఇండియా ఆట తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చూపిన భారత్.. ఫీల్డింగ్ లోనూ అదే జోరు చూపించింది.

ముఖ్యంగా ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ అందుకున్న మూడు క్యాచ్ లను ఇప్పట్లో అభిమానులు మర్చిపోలేరు.. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ ఫీల్డింగ్ ను అయితే అస్సలు మర్చిపోలేరు.. సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు.. న్యూజిలాండ్ తో జరిగిన నిర్ణయాత్మక మూడో టి20 లో అతని ఫీల్డింగ్ ఫీట్స్ చూసిన అభిమానులు వహ్వా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. ఈ మ్యాచ్ ఆరంభంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించిన సూర్య.. అక్కడ స్టన్నింగ్ క్యాచ్ లు అందుకున్నాడు..
ఫిన్ అలెన్, గ్లెన్ పీలిప్స్ ఇద్దరూ ఇచ్చిన క్యాచ్ లను సూర్య అందుకున్న విధానం… అతని అద్భుతమైన బ్యాలెన్స్ ను చూపిస్తున్నాయి. వీటికి తోడు బౌండరీ లైన్ వద్ద కూడా సూర్య ఒక సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు.. ఇవన్నీ కూడా గాల్లో చాలా ఎత్తుకు లేచిన బంతులే కావడం గమనార్హం.. ఇలాంటి క్యాచ్ లు పట్టుకోడానికి అద్భుతమైన ఫీల్డర్లు కూడా కొంత తడబడతారు.. కానీ సూర్యలో ఏమాత్రం తడబాటు కనిపించడం లేదు. సూర్య మాత్రమే కాదు మరో ధనాధన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫీల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

వీరిద్దరి ఫీల్డింగ్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.. వీళ్ళిద్దరూ ఫీల్డింగ్ లో కూడా ఇంటెంట్ చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. బౌండరీ లైన్ వద్ద సూర్య చూపిన బ్యాలెన్స్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.. స్లిప్స్ లో ఉండగా గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్ మహా అద్భుతం అంటున్నారు..ఫిన్ అలెన్ క్యాచ్ ఎలాగయితే అందుకున్నాడో.. పిలిప్స్ క్యాచ్ కూడా అలాగే అందుకున్నాడు.. ఇది చూసిన నెటిజన్లు ” అలెన్ క్యాచ్ ను కాపీ చేసి పిలిప్స్ కు కూడా పేస్ట్ చేసినట్టు ఉందని” జోకులు పేలుస్తున్నారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.