Suresh Babu: హైదరాబాద్ సిటీ లో ఉన్నంత ట్రాఫిక్ ఇండియా లో ఎక్కడ ఉండదు అని అందరూ అంటూ ఉంటారు..గల్లీ గల్లీ కి ఒక ఫ్లైఓవర్ ఉన్నా, మెట్రో రైళ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ నియంత్రలోకి రాలేదు..పైగా ఇక్కడి సిటిజన్స్ ట్రాఫిక్ పోలీసులతో సంబంధం లేకుండా సిగ్నల్స్ ని తూచాతప్పకుండా ఫాలో అవ్వడం అలవాటు చేసుకున్నారు..దీనితో చాలా జంక్షన్స్ లో ట్రాఫిక్ పోలీసులు పెద్దగా మనకి కనిపించరు, కేవలం వీకెండ్స్ లో తప్ప..అయితే కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ జామ్స్ అవుతుంటాయి.

పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం ఈ ట్రాఫిక్ జామ్ కి అతీతులుకారు..పోలీసులు లేని సమయం లో విపరీతమైన ట్రాఫిక్ ఉన్న కారణం గా కొంతమంది సెలెబ్రిటీలు కారు దిగి ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యడం ఇదివరకు మనం చాలా సార్లు చూసాము..ఇప్పుడు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కూడా ఆ పని చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఫిల్మ్ నగర్ లో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడింది..గంటల తరబడి వాహనాలు అన్నీ నిలిచిపోయాయి..ఆ ట్రాఫిక్ లో ఒక అంబులెన్సు కూడా చిక్కుకుంది..అదే ట్రాఫిక్ లో నిర్మాత సురేష్ బాబు కూడా ఇరుక్కున్నారు..అయితే ఆయన ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్సు ని గమనించాడు..దానికి లైన్ క్లియర్ చెయ్యడం కోసం సురేష్ బాబు నేరుగా ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తి , రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చాడు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

మనకి ఎందుకులే అని వదిలేయకుండా అంబులెన్సు చిక్కుకుందని, దానికి దారి వదలాలని సురేష్ బాబు ఇలా బాధ్యతతో వ్యవహరించడం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది..ఇన్నాళ్లు ఒక బ్రిలియంట్ నిర్మాతగా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న సురేష్ బాబు లో ఇంత మంచి మనసున్న మనిషి కూడా ఉన్నాడా అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్.