Ravi Teja- Shakalaka Shankar: ఒక వివాదం మరో వివాదానికి దారి తీయడం అంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవిని కించపరిచేలా మాట్లాడాడని బండ్ల గణేష్ ని విమర్శించే క్రమంలో జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ మరో వివాదానికి తెరలేపారు. తప్పైపోయిందని నాలుక కరుచుకొని క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే… రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా సూపర్ హిట్ కొట్టింది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ధమాకా సక్సెస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు ఈ సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. బండ్ల గణేష్ ఎప్పటిలాగే ప్రసంగంలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు.

బరువైన పదాలు, ప్రాసలు వాడుతూ రవితేజను ఆకాశానికి ఎత్తారు. రవితేజ ఎవరి సప్పోర్ట్ లేకుండా కష్టపడి స్టార్ అయ్యాడని చెప్పే క్రమంలో ఆయన ఓ మాట అన్నారు. ‘కొంత మంది రెండు మూడేళ్లలో అదృష్టం కలిసొచ్చి పెద్దగా కష్టపడకపోయినా… మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోతారు. రవితేజ అలా కాదు. ఏళ్ల తరబడి శ్రమించి, సచ్చినా బ్రతికినా పరిశ్రమలోనే అని నిలబడి స్టార్ అయ్యాడు” అని బండ్ల కామెంట్ చేశారు. మెగాస్టార్ అనేది చిరంజీవి బిరుదు కావడంతో కొందరు అభిమానులు హర్ట్ అయ్యారు.
బండ్ల గణేష్ కామెంట్ కి షకలక శంకర్ కౌంటర్ ఇచ్చాడు. ఓ మూవీ వేడుకలో పాల్గొన్న షకలక శంకర్… బండ్ల గణేష్ పేరు ఎత్తకుండా చురకలు వేశాడు. అదృష్టం వలన మెగాస్టార్లు కారు. ఏళ్ల తరబడి రేయింబవళ్ళు కష్టపడితే అవుతారు. ఎవడో ఒక హీరో ముందు కూర్చోగానే నోటికి వచ్చింది మాట్లాడతావా? అని ఫైర్ అయ్యాడు. షకలక శంకర్ ‘ఎవడో హీరో’ అనడాన్ని రవితేజ ఫ్యాన్స్ తప్పుబట్టారు. బండ్ల గణేష్ మాట్లాడింది, ఆయన ఎదురుగా ఉంది రవితేజనే కావడంతో షకలక శంకర్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో షకలక శంకర్ వివరణ ఇచ్చారు. రవితేజకు క్షమాపణ చెబుతూ వీడియో బైట్ విడుదల చేశాడు. రవితేజ అన్నయ్య అంటే నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఏదో మబ్బులో వాడు వీడు అని వచ్చేసింది. అంతకు మించి మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. మన అభిమాన హీరో గురించి మాట్లాడేటప్పుడు కూడా వాడు వీడు అనే పదాలు ఫ్లోలో వచ్చేస్తుంటాయి. ఏది ఏమైనా నా మాటలు కొందరిని హర్ట్ చేశాయి కాబట్టి నన్ను క్షమించండి, అని షకలక శంకర్ సదరు వీడియోలో మాట్లాడారు.
@RgvShankar said SORRY to RT & fans … #ShakalakaShankar pic.twitter.com/KwyBN6ow0Q
— Shravan – Chk my pinned tweet (@rhudmshravan) January 2, 2023