
Surender Reddy: అక్కినేని అఖిల్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రెండున్నర సంవత్సరాలు కష్టపడి చేసిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన సినిమాల్లోని హీరోలకు డిఫెరెంట్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేసే సురేందర్ రెడ్డి , ఈ సినిమాలో కూడా అఖిల్ పాత్రని ఆ రేంజ్ డిఫరెంట్ గా డిజైన్ చేసాడు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో అఖిల్ ని చూస్తున్నంత సేపు, ఒక స్టైలిష్ బీస్ట్ ని చూస్తున్న అనుభూతి కలిగింది. ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా హాజరయ్యాడు.

ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించే సమయం లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎన్ని కష్టాలను అనుభవించాడో అందరికీ తెలిసిందే. సరిగ్గా షూటింగ్ ప్రారంభమైన కొత్తల్లో ఆయనకీ కరోనా చాలా తీవ్రమైన అట్టాక్ ఇచ్చింది. ICU వార్డు లో ప్రాణాలతో చెలగాటం ఆడి బయటకొచ్చి ఈ సినిమా చేసాడు.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘నా కెరీర్ ప్రారంభం అయ్యింది వరంగల్ లోనే, నేను అయితే సినిమా డైరెక్టర్ ని అవ్వాలి అని డిసైడ్ అయ్యింది ఇక్కడికి వచ్చిన తర్వాతే, ఇక్కడి నుండే నేను హైదరాబాద్ కి పయనం అయ్యి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. అఖిల్ నీకు సినిమా ప్రారంభం అయ్యే ముందు నేను ఏదైతే మాట ఇచ్చానో, ఆ మాట నిలబెట్టుకున్నాను అనే అనుకుంటున్నాను.ఈ నెల 28 వ తారీఖున ఆడియన్స్ కి థియేటర్ లో అద్భుతమైన యాక్షన్ సినిమాని చేసాము అనే అనుభూతిని కచ్చితంగా ఇస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.