
Kantara – Rajinikanth: దక్షిణాది సినీ పరిశ్రమ ఖ్యాతిని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన కొన్ని సినిమాలలో ఒకటి ‘కాంతారా’.అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
ఇక ఈ సినిమా పై టాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ అని సంబంధం లేకుండా ప్రతీ సెలబ్రిటీ ప్రశంసల వర్షం కురిపించేసారు.వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకడు.ఈ సినిమాని చూసి ఎంతో థ్రిల్ కి గురైన రజినీకాంత్ రిషబ్ శెట్టికి మరియు మూవీ టీం కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేయడం మాత్రమే కాకుండా,ప్రత్యేకంగా తన ఇంటికి పిలిచి సన్మానించాడు సూపర్ స్టార్.రిషబ్ శెట్టి ఇందుకు ఎంతో ఆనందించాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ప్రీక్వెల్ కూడా ఉంటుందని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియచేస్తామంటూ రిషబ్ శెట్టి ఈమధ్యనే అధికారికంగా మీడియా ముందు ప్రకటించాడు.ఆయన ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి.ఈ చిత్రం లో హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతుల్లా నటించబోతుండడం దాదాపుగా ఖరారు కాగా,సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించబోతున్నాడని కూడా ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.

ఇదే విషయాన్నీ రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో రిషబ్ శెట్టి ని అడగగా ఆయన దానికి సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.ఒకవేళ ఈ వార్త అబద్దం అయితే వెంటనే ఫేక్ న్యూస్ అని చెప్పేవాడు, కానీ రిషబ్ శెట్టి అలా మౌనం గా ఉన్నాడంటే కచ్చితంగా ఈ సినిమాలో రజినీకాంత్ నటిస్తున్న విషయం దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని విశ్లేషకులు చెప్తున్నారు.