Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలు చేసి చాలా రోజులే అయ్యింది..అయితే ఆ తర్వాత మహేష్ బాబు కుటుంబం లో చోటు చేసుకున్న కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది..ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఈరోజు ఒక శుభవార్త వచ్చింది..నేటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది..సారధి స్టూడియోస్ లో వేసిన ఒక సెట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వం లో ఒక భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటించబోతుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ గురించి సోషల్ మీడియా లో గత కొద్ది రోజుల అనేక కథనాలు వినిపిస్తున్నాయి..ఇందులో ఇప్పటి వరకు మహేష్ కెరీర్ మనం ఎప్పుడూ చూడని లుక్ ని అభిమానులకు చూపించి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట త్రివిక్రమ్..పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందో, అదే రేంజ్ లుక్ మహేష్ కోసం డిజైన్ చేసాడట త్రివిక్రమ్.

మీసం , గడ్డం లేకుండానే సినిమాలు చేసే మహేష్ ని ఇంత మాస్ లుక్ లో చూపించబోతున్నాడు అనే వార్త బయటకి రావడం తో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అభిమానులు కంగారు పడుతున్నారు..మహేష్ కి అలాంటి లుక్స్ సెట్ అవుతాయో లేదా అనే సందేహం లో పడిపోయారు..కానీ అభిమానులకు పూనకాలు రప్పించే విధంగా ఆ లుక్ ఉంటుందని..ఫస్ట్ లుక్ విడుదలైన రోజు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.