Prabhas: పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఎవరికీ మాత్రం ఉండదు..?, నిర్మాతల పాలిట వజ్రం తో సమానం ఆయన..సరైన కథ తో ప్రభాస్ తో సినిమా తీస్తే పాన్ ఇండియన్ లెవెల్ లో ఆయనకీ ఇండస్ట్రీ హిట్ ని అవలీలగా కొట్టేంత స్టార్ స్టేటస్ ఉంది..ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాలకు వచ్చే వసూళ్లు తన తోటి స్టార్ హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ తో సమానం అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయం లేదు.

అలాంటి స్టార్ తో సినిమా చెయ్యడానికి ఎప్పటి నుండో #RRR మూవీ నిర్మాత ఎదురు చూస్తున్నాడు..కానీ చేతినిండా పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ డీవీవీ ప్రాజెక్ట్ కి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నాడు..ఎంతో కాలం ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూసిన డీవీవీ దానయ్యకి ఓపిక నశించి ప్రభాస్ ని అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నాడట.
ప్రభాస్ కి అడ్వాన్స్ ఇచ్చి 5 ఏళ్ళు అవుతుందని..ఈ ఏడాది లోపు నా సినిమాకి డేట్స్ ఇవ్వకపోతే ఇచ్చిన అడ్వాన్స్ కి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని డీవీవీ ప్రభాస్ కి చెప్పాడట..దానయ్య & టీం ప్రభాస్ తో అలా మాట్లాడడం నచ్చలేదట..వెంటనే తన దగ్గర క్యాష్ లేకపోయినా అన్నయ్య ప్రబోధ్ దగ్గర డబ్బులు అప్పు చేసి దానయ్య కి తిరిగి ఇచ్చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది..ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆది పురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలు ఉన్నాయి.

ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగా, ప్రాజెక్ K మరియు సలార్ మూవీ షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి..వీటితో పాటు యంగ్ డైరెక్టర్ మారుతీ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్..ఈ సినిమా షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది..ఈ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి అయిపోయిన తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ తో ‘స్పిరిట్’ అనే సినిమా చెయ్యబోతున్నాడు.