https://oktelugu.com/

Super star krishna last rites : ఇక సెలవు.. ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

టాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచెత్తి వెళ్లిపోయిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో కృష్ణకు అధికారిక లాంఛనాల మధ్య మహేష్ బాబు తలకొరివిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పోలీసులు గాల్లోకి తుపాకులను పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర మహా ప్రస్థానానికి చేరుకుంది. నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. కృష్ణకు నివాళులర్పించేందుకు అభిమానులు భారీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2022 / 04:01 PM IST
    Follow us on

    టాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచెత్తి వెళ్లిపోయిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో కృష్ణకు అధికారిక లాంఛనాల మధ్య మహేష్ బాబు తలకొరివిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పోలీసులు గాల్లోకి తుపాకులను పేల్చి గౌరవ వందనం సమర్పించారు.

    అంతకుముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర మహా ప్రస్థానానికి చేరుకుంది. నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. కృష్ణకు నివాళులర్పించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తమను చూడనివ్వడం లేదని పద్మాలయ స్టూడియో బయట అభిమానులు గొడవకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి తోపులాట చోటుచేసుకుంది. లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు.కొంత సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    అశేష అభిమానుల అశ్రు నయనాల మధ్య కృష్ణ అంతక్రియలు ఘనంగా ముగిశాయి. కృష్ణ అంతిమయాత్రలో మురళీ మోహన్ తోపాటు చాలా మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ర్యాలీగా మహా ప్రస్థానానికి కాలినడకన వచ్చారు. కృష్ణ భౌతిక కాయాన్ని అంతక్రియల కోసం అభిమానులను గేటు బయటే ఆపేసి మహేష్, కృష్ణ కుటుంబ సభ్యులను మాత్రమే మహాప్రస్థానంలోకి పోలీసులు అనుమతించారు. అనంతరం కృష్ణకు మహేష్ తలకొరివి పెట్టారు.

    మంగళవారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మరణించారు. కృష్ణ పార్థీవ దేహాన్ని నిన్న ఉదయమే నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీవ దేశానికి నివాళులర్పించారు. మొత్తంగా ఆశ్రునయనాలతో ఆ మహానటుడిని అందరూ సాగనంపారు.