
Vishwak Sen- Junior NTR: ఈమధ్య ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త హీరోలలో యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న హీరోలలో ఒకడు విశ్వక్ సేన్.విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పరచుకున్నాడు.మొదటి సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ నుండి మొన్న వచ్చిన ‘ఓరి దేవుడా’ చిత్రం వరకు ప్రతీ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
అందుకే ఆయనని యూత్ కి అంత దగ్గర చేసింది,ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తూ, దర్శకత్వం చేస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించిన ‘ధమ్కీ’ చిత్రం వచ్చే నెల 22 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.కచ్చితంగా యూత్ ని ఆకట్టుకునే విధంగానే ఈ సినిమా ఉంటుంది అని కంటెంట్ ని చూస్తుంటే అర్థం అయిపోతుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో మార్చి 18 వ తారీఖున ఘనంగా జరపబోతున్నారు.విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే.దీనిని స్వయంగా ఆయనే అనేక సందర్భాలలో తెలిపాడు కూడా.అయితే కెరీర్ లో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాణం పెట్టి చేసిన సినిమా కావడం తో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది.

ఇటీవలే విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం అందించాడట.ఎన్టీఆర్ ఆ సమయం లో ఇండియాలోనే ఉంటే కచ్చితంగా వస్తానని మాట కూడా ఇచ్చినట్టు సమాచారం.ఇప్పటికీ ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.ఆ హైప్ కి ఎన్టీఆర్ వంటి వాళ్ళు కూడా తోడు అయితే విశ్వక్ సేన్ కి గ్రాండ్ హిట్ రాసిపెట్టినట్టే లెక్క అని విశ్లేషకులు అంటున్నారు.