Michael Movie Collections: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన సందీప్ కిషన్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ కాస్టింగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో తీసిన చిత్రం మైఖేల్..వేంకటాద్రి ఎక్సప్రెస్ తర్వాత సందీప్ కిషన్ సినిమా చూడాలి అని ప్రేక్షకులకు అనిపించిన చిత్రం ఇదే,టీజర్ మరియు ట్రైలర్ కూడా డీసెంట్ గా ఉండడం తో పాటుగా, పాన్ ఇండియన్ చిత్రం గా ప్రచారం అవ్వడం, భారీ కాస్టింగ్ ఉండడం వంటివి ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి..టాక్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో రావడం తో ఓపెనింగ్స్ అనే రేంజ్ లో వచ్చాయి, ఇతర బాషలలో పట్టించుకోదగ్గ కనీస స్థాయి వసూళ్లు కూడా రానప్పటికీ తెలుగు లో మాత్రం సందీప్ కిషన్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ గా నమోదు అయ్యింది.

హీరో ఎవరైనా కానీ, క్రైమ్ యాక్షన్ జానర్ సినిమాలంటే మన తెలుగు ఆడియన్స్ చెవి కోసుకుంటారు అనడానికి ఉదాహరణ గా నిలిచింది ఈ చిత్రం..నైజం ప్రాంతం లో ఈ సినిమా కి కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి,మార్నింగ్ షోస్ బాగా డల్ గా ఉన్నప్పటికీ మ్యాట్నీ షోస్ నుండి మాత్రం ప్రధాన ప్రాంతాలలో కలెక్షన్స్ పిక్ అయ్యాయి,అందుకు కారణం టాక్ అనే చెప్పాలి.

ఇక తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మరియు సీడెడ్ వంటి ప్రాంతాలకు కలిపి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..ఇది సందీప్ కిషన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు..ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల రూపాయిల వరకు జరిగింది,టాక్ డీసెంట్ గా ఉంది కాబట్టి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.