Homeట్రెండింగ్ న్యూస్Sukant Singh: నాలుగు రోజుల్లో 321 కిలోమీటర్లు పరిగెత్తాడు.. మన మీడియా మర్చిపోయిన పరుగుల వీరుడు...

Sukant Singh: నాలుగు రోజుల్లో 321 కిలోమీటర్లు పరిగెత్తాడు.. మన మీడియా మర్చిపోయిన పరుగుల వీరుడు ఇతడు

Sukant Singh: అతడి పేరు సుకాంత్ సింగ్. ఇతని స్వస్థలం ముంబై.. ఇతరికి చిన్నప్పటినుంచి పరుగు పోటీలలో పాల్గొనడం చాలా ఇష్టం. తద్వారా దానిని అతడు తన కెరీర్ గా మార్చుకున్నాడు. కాకపోతే అల్ట్రా మారథాన్ రేసు లలో పాల్గొనడం ద్వారా.. అతడు అల్ట్రా మారథాన్ అథ్లెట్ అయిపోయాడు.. ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన డెలిరియస్ వెస్ట్ రేసులో అతడు తన సత్తా చాటాడు.. ఇప్పుడు మాత్రమే కాదు 2023 నుంచి 2025 మధ్యలో దాదాపు ఆస్ట్రేలియాలో అతడు మూడు అల్ట్రా మారథాన్ రేసులలో పాల్గొన్నాడు.. డెలిరియస్ వెస్ట్ రేసు మాత్రమే కాకుండా, అన్ రీజనబుల్ ఈస్టులో కూడా అతడు పరిగెత్తాడు. అతడు ఈ స్థాయిలో ఘనత సాధించినప్పటికీ.. మీడియాలో పెద్దగా ప్రచారానికి నోచుకోక పోవడం విశేషం. సుకి ఏప్రిల్ 9 నుంచి 13 మధ్య ఆస్ట్రేలియాలోని పర్సనల్ ప్రాంతంలోని నార్త్ క్లిఫ్ నుంచి ఆల్బానీ వరకు 321 కిలోమీటర్లు పరిగెత్తాడు. దాదాపు 94 గంటలు అతడు నిర్విరామంగా పరుగు తీశాడు. దాదాపు తక్కువ నిద్ర మాత్రమే పోయి.. అతడు పరుగులు తీశాడు. ” కరోనాకు ముందు నా జీవితంలో అత్యంత దారుణమైన మానసిక, శారీరక స్థితిలో ఉన్నాను. అప్పుడు నాకు ADHD ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఒత్తిడి, నిరాశను నివారించడానికి మందులు పనిచేయవు. ఇక అప్పట్నుంచి పరుగు తీయడం మొదలుపెట్టాను.. సుదీర్ఘంగా పరుగు తీయడం నాకు ఒక రకంగా చికిత్సగా మారింది. 300 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టడం మామూలు విషయం కాదు.. ప్రపంచంలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే దీనిని పూర్తి చేయగలరు. ప్రపంచంలో 400 మంది మాత్రమే డెలిరియస్ వెస్ట్ ను పూర్తి చేయగలరని నాకు ఇటీవల తెలిసింది. అందులో నేను కూడా ఉండడం సంతోషంగా అనిపించిందని” సుకి వ్యాఖ్యానించాడు.

Also Read: కాశ్మీర్ అంటే అసలు అర్థం తెలుసా? ఆ పేరు రావడానికి ఎన్ని కథలు ఉన్నాయంటే?

ఇలా మొదలుపెట్టాడు

2010 – 11 నుంచి పదివేల నుంచి 20వేల అడుగుల మేర పరుగులు తీయడాన్ని మొదలుపెట్టాడు సుకి. ఆ తర్వాత అతడు దానిని పూర్తి మారథాన్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత తనకు తెలియకుండానే వాటిని 100, 200, 300 కిలోమీటర్లకు మార్చుకున్నాడు. వాస్తవానికి ఒక రోజు నిద్ర లేచిన తర్వాత 350 కిలోమీటర్లు పరుగులు తీయడం సాధ్యం కాదు. దానికి ఎటువంటి శిక్షణ లేకుండా 350 కిలోమీటర్లు పరుగులు తీయడం అంటే ఒక రకంగా శరీరాన్ని చావువైపు నెట్టేసినట్టే. సుకి 10 సంవత్సరాల క్రితం 10 నుంచి 12 వేల అడుగుల పరుగుతో మొదలుపెట్టాడు. దానికంటే ముందు డేవిడ్ గోగిన్స్ అనే అథ్లెట్ నుంచి ప్రేరణ పొందాడు. సుకి గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. అందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.. ఆస్ట్రేలియాలో జరిగిన డెలిరియస్ వెస్ట్ రన్ కేవలం ఆల్ట్రా మారథాన్ మాత్రమే కాదు. అది ఒక రకంగా మనగడం కోసం పోరాటం. పాముల నుంచి తప్పించుకోవాలి. కంగారుల నుంచి కాపాడుకోవాలి. సుకి 321 కిలోమీటర్ల రేసును 94 గంటల్లో పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాలోని నార్త్ క్లిప్ నుంచి ఆల్బాని వరకు ఇది సాగింది. వాస్తవానికి ఈ రేసు 350 కిలోమీటర్లని మొదట నిర్ధారించారు. అయితే ఆస్ట్రేలియాలో వ్యాపించిన మంటల వల్ల దానిని 321 కిలోమీటర్లకు తగ్గించారు. ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేసు ఇది. సుకి నిద్ర, ఆకలి కోసం కేవలం కొంత సమయం మాత్రమే విశ్రాంతి తీసుకునేవాడు. ఈ రేసులో 61 మంది పాల్గొనగా.. అందులో సగం కంటే తక్కువ మంది మాత్రమే దీనిని పూర్తి చేశారు..

Also Read: పోక్సో కేసు పెట్టాలి… కీరవాణి పై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version