Veera Simha Reddy Suguna Sundari Song: ‘అఖండ’ వంటి సంచలన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో చేసిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’..బాలయ్య బాబు కి బాగా అచొచ్చిన ఫ్యాక్షన్ జానర్ లో తెరకెక్కిన సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి..టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..రీసెంట్ గా విడుదల చేసిన ‘జై బాలయ్య’ సాంగ్ కూడా సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

అలా అన్నీ విధాలుగా పాజిటివ్ బజ్ ని ఏర్పర్చుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు రెండవ సాంగ్ విడుదలైంది..’సుగుణ సుందరి’ అంటూ సాగే ఈ పాట చాలా క్యాచీ గా ఉంది..థమన్ మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు..ఈ పాట మూవీ పై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది..బాలయ్య బాబు సాధారణంగానే ఈ పాటలో కూడా తనదైన మార్క్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసాడు..థియేటర్ లో ఫ్యాన్స్ కి ఈ సాంగ్ ఫీస్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు..అయితే ఈ పాటలో డాన్స్ స్టెప్పులన్నీ మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ లోని సుందరి అనే సాంగ్ తో పోలినట్టు అందరికి అనిపించింది..ఆ సాంగ్ లో సిగ్నేచర్ మూవ్మెంట్స్ చాలానే ఉంటాయి..అదే తరహాలో ‘సుగుణ సుందరి’ పాట కూడా ఉంది..ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం నెటిజెన్స్ అనుకుంటున్నది ఇదే..జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ చిత్రం లో విలన్ గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది..ఇందులో బాలయ్య బాబు బాలసింహా రెడ్డి మరియు వీర సింహా రెడ్డి అనే రెండు పాత్రలలో నటిస్తున్నాడు..బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేసిన సినిమాల్లో విజయం సాధించిన చిత్రాలే ఎక్కువ..వీర సింహా రెడ్డి చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరుతుందో లేదో చూడాలి.