
Sudigali Sudheer Marriage: బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ పెళ్లి కోసం అశేష అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. హీరోగా కూడా సక్సెస్ అయిన ఈ జబర్దస్త్ కమెడియన్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. సుధీర్ వయసు 35 ఏళ్ళు దాటి పోయింది. కెరీర్లో కూడా సెట్ అయ్యాడు. లక్షల సంపాదన, ఇల్లు, కార్లు అన్నీ సమకూర్చుకున్నాడు. ఇక పెళ్ళికి లేటేంది? అనే సందేహం అందరిలో ఉంది. అయితే ఎట్టకేలకు అభిమానులు కోరుకున్న క్షణం వచ్చింది. సుధీర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.
పేరెంట్స్ కోరిక మేరకు సుధీర్ పెళ్ళికి ఒప్పుకున్నాడట. ఇక అమ్మాయిని కూడా నిర్ణయించేశారట. సుధీర్ చుట్టాల అమ్మాయిని చేసుకోబోతున్నాడట. వరసకు మరదలు అవుతుందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే సుధీర్ పెళ్లిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాబట్టి స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే. గతంలో కూడా పలుమార్లు సుధీర్ వివాహం అంటూ కథనాలు వెలువడ్డాయి. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

కాగా సుధీర్ యాంకర్ రష్మీ గౌతమ్ ని ప్రేమిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం అవుతుంది. ఏళ్ల తరబడి వీరిద్దరూ బుల్లితెర మీద రొమాన్స్ కురిపించారు. దీంతో సుధీర్-రష్మీ వివాహం చేసుకోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే మేము స్నేహితులం మాత్రమే… ప్రేమికులం కాదని ఈ జంట పలుమార్లు వెల్లడించారు. సుధీర్ తో పాటు రష్మీ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. సడన్ గా ఏదో ఒకరోజు మా పెళ్లని షాక్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ చూస్తున్నారు.
ఇక హీరోగా సుధీర్ ఫస్ట్ హిట్ కొట్టాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన గాలోడు మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు విస్మయం చెందాయి. మనోడి మాస్ లో బాగానే ఫాలోయింగ్ ఉందని అర్థమైంది. కాలింగ్ సహస్ర టైటిల్ తో ఓ మూవీ చేస్తున్న సుధీర్… మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నట్లు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.