https://oktelugu.com/

Sudheer Anasuya: ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ ఎంట్రీ! అసలేమైంది?

Sudhir Sudheer’s entry into ETV again! : ఈటీవీ 27 ఏళ్ల పండుగ ప్రారంభమైంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దింది. ఒక మెజిషియన్ గా రామోజీ ఫిలిం సిటీలో పావురాలు ఎగరవేసే సుధీర్ ను జబర్ధస్త్ కమెడియన్ గా అవకాశం ఇచ్చి.. ఇప్పుడు పాపులర్ బుల్లితెర స్టార్ గా మార్చింది. గెటప్ శీనును బుల్లితెర కమలాసన్ ను చేసింది. హైపర్ ఆదిని పంచుల వీరుడిగా తీర్చిదిద్దింది. అనసూయ,రష్మీ సహా ఎంతో మందికి లైఫ్ […]

Written By: , Updated On : August 18, 2022 / 11:18 AM IST
Follow us on

Sudhir Sudheer’s entry into ETV again! : ఈటీవీ 27 ఏళ్ల పండుగ ప్రారంభమైంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దింది. ఒక మెజిషియన్ గా రామోజీ ఫిలిం సిటీలో పావురాలు ఎగరవేసే సుధీర్ ను జబర్ధస్త్ కమెడియన్ గా అవకాశం ఇచ్చి.. ఇప్పుడు పాపులర్ బుల్లితెర స్టార్ గా మార్చింది. గెటప్ శీనును బుల్లితెర కమలాసన్ ను చేసింది. హైపర్ ఆదిని పంచుల వీరుడిగా తీర్చిదిద్దింది. అనసూయ,రష్మీ సహా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.

Sudhir Sudheer's entry into ETV again

Sudhir Sudheer’s entry into ETV again

ఈటీవీ నుంచి ఎదిగిన వారు రైటర్స్ గా, దర్శకులుగా, డ్యాన్స్ మాస్టర్లుగా, కమెడియన్స్ గా, హీరోలుగా స్థిరపడ్డారు. అందుకే ఈ 27 ఏళ్ల ఈటీవీ వార్షికోత్సవ పండుగకు తమ పాత పగలన్నీ మరిచిపోయి వారంతా హాజరయ్యారు. ఒక్కటై సందడి చేశారు. ఈటీవీ, మల్లెమాలపై కోపంతో వెళ్లిపోయిన సుధీర్ కూడా తన మనసు మార్చుకొని ఈ 27 ఏళ్ల పండుగలో పాలుపంచుకోవడం విశేషం.తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం హంగామా వేడుక వీడియో విడుదలైంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర సహా ఈటీవీని వీడిన వారంతా కనిపించడంతో అందరూ సంబరుపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ వీరంతా ఈటీవీలోకి వచ్చేశారని అనుకుంటున్నారు.

మల్లెమాల రూపొందించిన జబర్ధస్త్, ఢీ సహా పలు షోల్లో నటించే సుధీర్ ఇటీవల గుడ్ బై చెప్పి స్టార్ మా టీవీలో షోల్లో పాల్గొంటున్నాడు. బుల్లితెరపై నంబర్ 1 కమెడియన్ గా.. యాంకర్ గా ఉన్న సుధీర్ పోవడం జబర్ధస్త్ పై ప్రభావం చూపింది. మల్లెమాలతో విభేదాల వల్లనే సుధీర్ వెళ్లాడని కథలు కథలుగా ప్రచారం జరిగింది.

ఆ తర్వాత జబర్ధస్త్ నుంచి వెళ్లిన కొందరు కమెడియన్స్ ఏకంగా మల్లెమాలపై యుద్ధం ప్రకటించి యూట్యూబ్ చానెల్స్ లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాత మల్లెమాల వల్లే ఆర్టిస్టులు వెళ్లిపోతున్నారా? అన్న సందేహాలు వచ్చాయి. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ కూడా జబర్ధస్త్ నుంచి వైదొలగడంతో ఆ షో రేటింగ్ పడిపోయింది.

ఇవన్నింటిని భర్తీ చేసేలా ఈటీవీ 27 ఏళ్ల పండుగ అందరినీ కలిపింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన ఈ షోకు తాజాగా సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయలు హాజరు కావడం..పోయిన కీలక కమెడియన్స్ అంతా కనిపించడంతో మళ్లీ ఈటీవీలోకి వీళ్లంతా రావడం ఖాయమని తెలుస్తోంది. మల్లెమాల తీరుతో అలిగివెళ్లిపోయిన వీరిని ఒక్కటి చేసేలా ఈ పండుగ చేసిందని అంటున్నారు. లైఫ్ ఇచ్చిన ఈటీవీ కోసమే వీరంతా మళ్లీ వచ్చినట్టుగా తెలుస్తోంది.

దీంతో మళ్లీ సుధీర్ జబర్ధస్త్ లో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఇక ఇన్నాళ్లు ఫ్యామిలీ ఆడియెన్స్ మిస్ అయిన ‘చమ్మక్ చంద్ర’ స్కిట్ లు కూడా మళ్లీ ఈటీవీలో కనిపించడం ఖాయమంటున్నారు. ఈటీవీకి పూర్వవైభవం వస్తుందని అంతా ఆశపడుతున్నారు.

సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ.. షాక్ లో రష్మీ || Sudigali Sudheer Re Entry in ETV@OkTeluguEntertainment

 

 

Bhale Manchi Roju Promo 01 - ETV 27 Years Celebrations - 28th August 2022 @ 7pm - Pradeep,Hyper Aadi