https://oktelugu.com/

YSRCP: వైసీపీని వీడని కూలన్మోదం..జనసేనపై విష ప్రచారం

YSRCP: గత ఎన్నికల్లో కులాల కుంపట్లు రగిలించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందింది. కులోన్మాదాన్ని ప్రోత్సహించి ఓట్లు పొందింది. కొన్ని కులాలను బూచీగా చూపి మిగతా కులాల ఓట్లను హస్తగతం చేసుకుంది. ఇప్పటికీ అదే జాడ్యాన్ని అవలంభిస్తోంది. తమపై ఉన్న అపవాదును వైసీపీ నేతలు ఇతరులపై నె ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. తనకు కులాలు లేవని.. తాను అందరివాడినని.. కులంపైనే ఆధారపడితే తన సొంత సామాజికవర్గం బలంతో దాదాపు 40 నియోజకవర్గాల్లో […]

Written By:
  • Dharma
  • , Updated On : August 18, 2022 / 11:11 AM IST
    Follow us on

    YSRCP: గత ఎన్నికల్లో కులాల కుంపట్లు రగిలించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందింది. కులోన్మాదాన్ని ప్రోత్సహించి ఓట్లు పొందింది. కొన్ని కులాలను బూచీగా చూపి మిగతా కులాల ఓట్లను హస్తగతం చేసుకుంది. ఇప్పటికీ అదే జాడ్యాన్ని అవలంభిస్తోంది. తమపై ఉన్న అపవాదును వైసీపీ నేతలు ఇతరులపై నె ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. తనకు కులాలు లేవని.. తాను అందరివాడినని.. కులంపైనే ఆధారపడితే తన సొంత సామాజికవర్గం బలంతో దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపొంది ఉండేవాడినన్నారు. ఏపీలో ఉన్న అన్ని కులాలను సమానంగా భావిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన్ను ఒక్క కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. అన్ని లిమిట్స్ క్రాస్ చేసి విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు.

    Pawan

    మంత్రి అమర్నాథ్ కామెంట్స్

    ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి దక్కించుకున్న గుడివాడ అమర్నాథ్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కులపరమైన విమర్శలతో పవన్ ను టార్గెట్ చేశారు. పవన్ నడిపిస్తున్నది కాపు జనసేన కాదని.. అది కమ్మ జనసేనగా అభివర్ణించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదేండ్ల మనోహర్ డైరెక్షన్ లో నడుస్తున్న కమ్మ జనసేన అని.. దానినే పవన్ నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు.అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కాపులను ఓన్ చేసుకోలేరని కూడా తేల్చేశారు.

    Gudivada Amarnath

    సోషల్ మీడియాలో పోస్టు..

    అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణలతో ఆపలేదు. విశాఖలో విలేఖర్ల సమావేశం అనంతరం ఆయన ఆ మాటలను సోషల్ మీడియాలో సైతం పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందిన వారని..ఆయన పార్టీని నాదేండ్ల మనోహర్ నడుపుతున్నారని.. ఆయన కమ్మకాబట్టి కమ్మజనసేనగా చెబుతూ అమర్నాథ్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై జనసైనికులు, కాపు సామాజికవర్గానికి చెందిన వారు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కుల రాజకీయాలు చేయడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి అమర్నాథ్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నెటిజెన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. మంత్రిగా శాఖ పరమైన పనులు వదిలి.. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగునా అని ప్రశ్నిస్తున్నారు.

    Also Read: Chanakya Niti: చాణక్య నీతి: జీవితంలో ఎదగాలంటే పాటించాల్సిన విషయాలేంటి?

    పీకే బృందం వ్యూహమే..

    Prashant Kishor

    అయితే ఇదంతా ప్రశాంత్ కుమార్ బృందం వ్యూహంగా తేలుతోంది. ప్రస్తుతం పవన్ వెంట కాపు సామాజికవర్గం ఉందన్న సమాచారం పీకే బృందంపై ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ కుల ప్రచారానికి మొదలు పెట్టినట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పై కుల ముద్ర వేయడంతో పాటు నిర్వీర్యం చేయాలన్నది వారి ప్లాన్. అందుకే గత కొద్దిరోజులుగా కాపు సామాజికవర్గం నేతలతో ఒక వ్యూహం ప్రకారం పవన్ ను తిట్టిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు. జనసేన పార్టీకి కులం రంగు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోందని.. దీనిని పవన్ కళ్యాణ్ సరైన రీతిలో తిప్పికొట్టాలని జనసేన వర్గాలు కోరుతున్నాయి.

    Also Read: Janasena Target Fix: ఆ మంత్రులను గెలవనివ్వం..జనసేన టార్గెట్ ఫిక్స్

    Tags