Street Dog Attack: వీధి శునకాలకు సంబంధించి ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం రకరకాల తీర్పులు ఇచ్చింది. చివరికి జంతు ప్రేమికులు కోరుకున్నట్టుగా తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు విషయం ఎలా ఉన్నా .. సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. వీధి శునకాల వల్ల జరిగే ప్రమాదాలు విపరీతంగా ఉంటున్నాయి. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు వీధి శునకాల గుంపు ప్రయత్నించింది. వాటి నుంచి అతడు తనను తనను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి విజయవంతమయ్యాడు. కాకపోతే ఈ ప్రక్రియలో అతడు తన ప్రాణాలకు తెగించాడు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
ఆ వ్యక్తి తన ద్విచక్ర వాహనం నుంచి ఒక సందు మీదుగా వెళుతున్నాడు. ఇంతలోనే వీధి శుననకాల గుంపు అతడిని అడ్డగించింది. అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దాదాపు ఏడు కు మించిన శునకాలు విపరీతంగా అరుస్తూ అతడిని కరవడానికి ప్రయత్నించాయి. దీంతో అతడు వాటి నుంచి తనను తాను కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి తను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టాడు. అప్పటికే అవి ఎదురుదాడిని ఆపకపోవడంతో గట్టిగా అరిచాడు. అతడు అరిచిన అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చారు. వారు రావడంతో ఆ గ్రామ సింహాల బృందం వెనక్కి వెళ్ళింది. ఒకవేళ చుట్టుపక్కల వారు కనుక ఆ సమయానికి రాకపోయి ఉంటే అతడి మీద పడి తీవ్రంగా దాడి చేసేది .. పదునైన దంతాలతో పిక్కలను పట్టుకొని లాగేవి. చివరికి మరింత దారుణంగా దాడి చేసి ఇబ్బంది పెట్టేవి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో కనిపిస్తున్న దృశ్యం మహారాష్ట్రలో చోటుచేసుకుంది.. ఇటీవల ఆ సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత వీధి శునకాలను అదుపు చేయాలని.. వాటి సంతతిని నియంత్రించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇస్తే.. ఇటీవల కొంతమంది జంతు ప్రేమికులు ఆ తీర్పును తప్పు పట్టడం పట్ల ఈ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి శునకాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్లో పనికి వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏడు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి, పక్కనే ఉన్న ఓ బైక్ను వాటికి అడ్డుగా పెట్టి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కుక్కలు వెనక్కి… pic.twitter.com/lmpxRUzFJY
— ChotaNews App (@ChotaNewsApp) August 23, 2025