
Youtuber Harsha Sai: ఒక్కో యూట్యూబర్ ఒక్కో రకం వీడియోలు చేశారు. హర్ష సాయి జనాలు సహాయం చేస్తూ ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ హర్ష సాయి గురించి తెలుసు. ముఖ్యంగా యూట్యూబ్ రెగ్యులర్ గా చూసే జనాల్లో హర్ష సాయి ఒక స్టార్ లెక్క. హర్ష సాయి వేలల్లో కాదు లక్షల్లో సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరైన ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న బార్బర్ కి వసతి ఏర్పాటు చేశాడు. ఓ స్కూల్ పిల్లాడికి ఇరవై వేలకు పైగా స్కూల్ ఫీజు చెల్లించాడు. బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభకు మెచ్చి స్కూల్ కి డొనేషన్ ఇచ్చాడు.
రోడ్డుపై నిస్సహాయంగా ఉన్న పేదవాళ్లకు హర్ష సాయి వెంటనే సాయం చేస్తాడు. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను పెద్ద హోటల్ కి తీసుకుపోయి భోజనం పెట్టిస్తాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా హర్ష సాయి తన సేవలు విస్తరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హర్ష సాయి చేసిన దానాలు లిస్ట్ చాలా పెద్దదే ఉంది. హర్ష సాయి ఈ దానాలు ఎలా చేయగలుతున్నాడు? అతనికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొందరు దీనిపై సర్వే కూడా చేశారు. హర్ష సాయి సహాయం పొందిన వాళ్లను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్స్ కి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ దక్కుతుంటాయి.
ఆ విధంగా వచ్చిన డబ్బులు హర్ష సాయి పేదలకు పంచి పెడతారు. తాను ఓ టీమ్ ని కూడా మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం. కలియుగ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న హర్ష సాయి రాజకీయాల్లో రాబోతున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. హర్ష సాయి జనసేన పార్టీలో చేరాలి అనుకుంటున్నాడట. అతడు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలదంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

సమాజహితం కోరే పవన్ భావజాలం నచ్చిన హర్ష సాయి జనసేన పార్టీ పట్ల ఆకర్షితుడు అయ్యారట. పవన్ కళ్యాణ్ ఆశయాలను తన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడట. హర్ష సాయి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందట. జనసేన పార్టీలో యువతకు పెద్ద పీఠ వేస్తారు. సాధారణ కార్యకర్తలే నాయకులు. కాబట్టి హర్ష సాయి జనసేనలో చేరనున్నారనే వాదనను కొట్టిపారేయలేం. అధినేత అనుమతి ఇస్తే హర్ష సాయి ఎంట్రీ లాంఛనం అవుతుంది.