Singer Chinmayi: నయనతారపై సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ ఉంది. అశేష అభిమానులతో పాటు విమర్శించే జనాలు కూడా ఉన్నారు. ఆమె లైఫ్ స్టైల్ రీత్యా దారుణమైన క్రిటిసిజం ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో నయనతార వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. కేరళ అమ్మాయి అయిన నయనతార కెరీర్ బిగినింగ్ లో హీరో శింబుతూ ఎఫైర్ నడిపారు. ఇద్దరూ కొంచెం ఘాటుగానే ప్రేమించుకున్నారు. ప్రైవేట్ ఫోటోలు కూడా బయటకు రాగా… అప్పట్లో రచ్చ రచ్చయ్యింది. శింబుకి బ్రేకప్ చెప్పిన నయనతార ప్రభుదేవాకు దగ్గరయ్యాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ నయన కోసం భార్యకు విడాకులు ఇచ్చారు.

పెళ్లి వరకు వెళ్లిన ప్రభుదేవా-నయనతార అనూహ్యంగా విడిడిపోయారు. 2015లో ఫ్రెష్ గా విగ్నేష్ శివన్ తో నయనతార రిలేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు వీరు డేటింగ్ చేశారు. పలుమార్లు విడిపోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లైన నెలల వ్యవధిలో సరోగసీ ద్వారా కవలలకు పేరెంట్స్ అయిన నయనతార దంపతులు వివాదాల్లో చిక్కుకున్నారు.
కాగా నయనతార నటించిన హారర్ మూవీ కనెక్ట్ డిసెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్ర ప్రీమియర్స్ కి నయనతార దంపతులు హాజరయ్యారు. పెళ్లి అయ్యాక మొదటి సారి ఇద్దరూ కలిసి పబ్లిక్ లో కనిపించారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నయనతార దంపతులను ఉద్దేశిస్తూ కొందరు దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేశారు. బూతు పదాలతో రెచ్చిపోయారు. ఈ వల్గర్ కామెంట్స్ పై సింగర్ చిన్మయి స్పందించారు. నయనతార దంపతులను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ పోస్ట్ చేసిన వారికి కౌంటర్లు ఇచ్చారు.

తల్లులు తమ ఇంటి ఆడపిల్లలను ఇలాంటి మగాళ్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారు మంచి వాళ్ళు కాదు. ఇలాంటి పురుషుల వలన ఆడపిల్లలకు రక్షణ లేదు. వారు ఆడపిల్లకు హాని చేయవచ్చు. అందుకు ఈ కామెంట్స్ నిదర్శనం… అని చిన్మయి మండిపడ్డారు. ఫెమినిస్ట్ గా చిన్మయి చాలా కాలంగా స్త్రీ హక్కులు, లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలపై పోరాడుతున్నారు. ఈ క్రమంలో నయనతారను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి చిన్మయి చురకలు వేశారు.